Site icon HashtagU Telugu

Ramu : ‘రాము’ పనితనాన్ని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా

Ramu

Ramu

ఇంటర్నెట్‌లో ఏదైనా విభిన్నమైన సంఘటనలు ఇతర మోటివేషనల్‌ వీడియోలను పంచుకునే ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) మరో వీడియోను తన (ఎక్స్‌) అకౌంట్‌లో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌లో ‘ఒకవేళ రాము మాట్లాడగలిగితే లైఫ్ పాజిటివ్ ఎలా ఉండాలనే దానిపై మంచి సలహా ఇస్తారు’ అని ఆయన రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన దేని గురించి రాసాడని అనుకుంటున్నారా..ఆయన తెలిపింది రాము అనే ఎద్దు గురించి.

‘ ఎవరి అవసరం లేకుండానే స్వతహాగా పనిచేసే ‘రాము’ అనే ఎద్దుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. రాము తన దినచర్యను తూచా తప్పకుండా చేస్తూ యజమానికి చేదోడువాదోడుగా ఉండటాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘ఒకవేళ రాము మాట్లాడగలిగితే లైఫ్ పాజిటివ్ ఎలా ఉండాలనే దానిపై మంచి సలహా ఇస్తారు’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా ఢిల్లీలో పానీపూరి అమ్ముతూ మహీంద్రా థార్‌ కొనుగోలు చేసిన అమ్మాయి గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల తాప్సి. బీటెక్ పూర్తి చేసిన ఈ అమ్మాయి పానీపూరీ విక్రయిస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా 40 స్టాల్స్ ఏర్పాటు చేసి నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తోంది. ఆ డబ్బుతో మహీంద్రా థార్ (Mahindra Thar) కొని దానికి పానీపూరీ బండి కట్టి తీసుకెళ్తుంది. ఇప్పుడు తాప్సీ ఢిల్లీలో ‘బీటెక్ పానీపూరీ వాలీ’ (BTech Pani Puri Wali)గా ఫేమస్ అయింది. ఈ వీడియో ను మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్స్‌ అధినేత ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో (ఎక్స్‌) షేర్ చేసాడు.ఈ ట్వీట్‌లో తన కలను నిజం చేసుకునేందుకు ఓ యువతి రేయింబవళ్లు కష్టపడిందని.. పానీపూరీ సెంటర్లు నెలకొల్పి తన కలల కారు మహీంద్రా ఎస్‌యూవీని కొనుగోలు చేసిందని ఆనంద్‌ మహీంద్రా చెప్పుకొచ్చారు. మహీంద్రా థార్‌ వెనకాల పానీపూరీ బండిని లాగుతున్న వీడియోను ఆయన ట్వీట్‌లో జత చేశారు.

Read Also : Telangana Budget Session 2024: ఫిబ్రవరి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు