Site icon HashtagU Telugu

Anand Mahindra : జింకలు, మనుషులని కలిపిన వర్షం.. ఆనంద్ మహీంద్రా వీడియో వైరల్..

Anand Mahindra shares interesting video on Deers and Humans

Anand Mahindra shares interesting video on Deers and Humans

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ, తనకు నచ్చిన అంశాలను నెటిజన్లతో పంచుకుంటారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra). ఆయన ఎప్పుడు ఏ విషయం మీద వీడియో షేర్ చేసినా అది క్షణాల్లో వైరల్(Viral video ) అవుతుంటుంది. అంతగా నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసే వీడియోలు కొన్ని మానవ సంబంధాలను ఉద్దేశించి అయితే, మరి కొన్ని విజ్ఞానం పంచేవి, ఇంకొన్ని కొన్ని కొందరి సృజనాత్మకత బయటపెట్టేవి.

ఇప్పుడు తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ కొత్త వీడియోతో నెటిజన్ల ముందుకొచ్చారు..

బయట బాగా వర్షం కురుస్తోంది. పాపం కొన్ని జింకలు తడిచిపోకుండా ఒకే చోట ఆశ్రయం పొందుతున్నాయి. ఎక్కడో తెలుసా ఓ హోటల్లో. మనుషులతోపాటు కొన్ని జింకలు ఓ హోటల్ లో కూర్చొని బయటకు చూస్తున్నాయి. జపాన్ లోని నారాలోని విల్డ్ సికా జింకలు, భారీ వర్షం, పిడుగులు పడుతుంటే అవి చక్కగా ఎంతగానో నమ్మే మనుష్యుల దగ్గర కూర్చొని రిలాక్స్ అవుతున్నాయి. వాటిని ఫోటోలు తీసే వాళ్లకి ఫోజులు ఇస్తున్నాయి. ఆ వీడియో ఎంత అద్భుతం అంటే.. ప్రకృతిలో ఇలా ఉంటేనే కదా అందం అని అనిపించేలా.

ఆనంద్ మహేంద్రా కూడా అదే మాట ట్వీట్ చేశారు. ఈ వీడియోను సేవ్ చేసుకుని ప్రపంచం ఎలా ఉండాలో నాకు నేను గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చూస్తానన్నారు. ట్విట్టర్‌లో ఆయన షేర్ చేసిన వీడియో ఎప్పటిలాగే వైరల్ అవుతోంది.

 

Also Read : Rs 4 crore in 45 days : ట‌మోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు