Site icon HashtagU Telugu

Anand Mahindra: నెటిజన్స్ ని భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా పోస్ట్.. ఆ పోస్టులో ఏముందో తెలుసా?

Netizens

Netizens

ప్రముఖ భారతీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా గురించి మనందరికీ తెలిసిందే. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో రకమైన పోస్టులను చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఆనంద్ మహీంద్రా. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అప్పుడప్పుడు సమాధానాలిస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు కొన్ని రకాల పోస్ట్ లు చేసి దానిపై నెటిజెన్స్ ని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఆ వీడియో నెటిజన్స్ ని భయాందోళనకు గురిచేస్తోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏమీ ఉంది?ఆ వీడియోని చూసి నెటిజన్స్ ఎందుకు అంతలా భయపడుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి అడవిలో జీప్ ముందు భాగంలో కూర్చుని ఫోటోలు తీసుకుంటూ ఉండు. చుట్టూ ఉండే వాతావరనాన్ని తన కెమెరాలో బంధిస్తూ ఉంటారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఆ సమయంలో అతని పక్క నుంచి ఒక సింహం నెమ్మదిగా ముందుకు వచ్చింది. సింహాన్ని చూసిన ఆ వ్యక్తికి ఎం చేయాలో తోచకుండా భయంతో చూస్తున్నది గమనించవచ్చు. సైలెంట్ గా వచ్చి పక్కన సింహం నిలబడడంతో ఆ వ్యక్తి గుండెజారి గల్లంతయ్యింది అన్నంత పని అయిపోయింది.

 

అయితే ఆ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా రెండు ప్రశ్నలను అడిగాడు.ఒకటి ఆ స్థానంలో మీరు ఉంటే వెంటనే ఏమి ఆలోచిస్తారు? రెండు మొదట మీరు ఏం చేస్తారు అని ప్రశ్నించాడు. అందుకు సంబంధించిన ట్వీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ట్వీట్ పై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందులో కొందరు కామెడీగా కామెంట్స్ చేస్తుండగా మరి కొందరు మాత్రం సీరియస్గా వారు ఉంటే ఏం చేస్తారు అన్న విషయాన్ని కామెంట్స్ రూపంలో చెబుతున్నారు.