Site icon HashtagU Telugu

Ulta Scooter : “ఉల్టా స్కూటర్” జిందాబాద్.. ఫ్యూజులు ఎగరగొట్టే క్రియేటివిటీ

Ulta Scooter

Ulta Scooter

Ulta Scooter :  ఒక వ్యక్తికి క్రియేటివిటీ ఓవర్ డోస్ అయింది..  

అతడు అందరి కంటే డిఫరెంట్ గా టూ వీలర్ ను డ్రైవ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.. 

దీంతో వెంటనే తన స్కూటర్ ను .. ఉల్టా స్కూటర్ గా మార్చేశాడు.. 

దానిపై అతడు రైడ్ చేస్తుంటే చూసే వాళ్ళకు కన్ఫ్యూజన్ తో ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.

Also read : Jyothi Yarraji : తెలుగు కెరటం జ్యోతి యర్రాజీకి కాంస్యం.. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో ప్రతిభ

ఇండోనేషియాకు చెందిన అరాఫ్ అబ్దురహ్మాన్ ఇటీవల తన స్కూటర్‌ను పూర్తిగా  రీ మోడిఫై చేశాడు. హ్యాండిల్‌ బార్‌ ను తీసుకొచ్చి షేక్ అబ్జార్బర్స్ పక్కన, సీటు కింద ఉండేలా ఫిట్ చేశాడు. హ్యాండిల్, సీటు మధ్య భాగంలో ఉండే ప్లేస్ లో తాను కూర్చొనేందుకు మెత్తటి సీటును అమర్చుకున్నాడు. దానిపై కూర్చొని హ్యాండిల్ ను బ్యాలన్స్ చేసుకుంటూ స్కూటర్ పై వెనక్కి రైడ్ చేస్తున్నాడు. దారిన పోయే ప్రతి ఒక్కరూ అబ్దురహ్మాన్ వైపు, అతడు నడుపుతున్న స్కూటర్ (Ulta Scooter) వైపు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ అవుతోంది.

Also read : Onion Prices: సామాన్యులకు మరో షాక్.. ఆగస్టు చివరి నాటికి పెరగనున్న ఉల్లి ధరలు..?