Site icon HashtagU Telugu

Viral Pic: హనుమాన్‌ జయంతిలో అద్భుత దృశ్యం.. చక్కర్లు కొడుతున్న ఫొటో

Hanuman1

Hanuman1

ఇటీవల హానుమాన్ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. దేశంలోని పలు చోట్లా హానుమాన్ ఉత్సవాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. అన్నదానాలు, ఉరేగింపులు, భజనలు, పూజలతో భక్తులు ఆంజనేయుడి సేవలో తరలించారు. అయితే మహారాష్ట్రలోని అకోలా జిల్లా బాషిటేకడి తాలూకా కోతడి గ్రామంలోని ముంగాసాజి మహారాజ్‌ ఆశ్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని గురువారం రాందాస్‌ సిందే మహారాజ్‌ అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. అయితే అకస్మాత్తుగా కొండముచ్చుల గుంపు అక్కడి వచ్చింది. దీంతో ఆలయ నిర్వాహకులు భక్తులతో పాటు వాటికి ప్రత్యేకంగా వడ్డించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Shocking: TSPSCలో మరో ట్విస్ట్.. గర్ల్ ఫ్రెండ్ కోసం 6 లక్షలతో పేపర్ కొనుగోలు!