Site icon HashtagU Telugu

Viral Video: కొంగను పట్టుకొని ఎందుకు ప్రయత్నించిన అలిగేటర్.. కానీ అంతలోనే?

Viral Video

Viral Video

మామూలుగా కొన్ని జంతువులు పక్షులు వాటికంటే బలంలో శక్తి సామర్ధ్యంలో చిన్న వాటిని వేటాడి మరీ తింటూ ఉంటాయి. వాటి ఆహారం కోసం వేటాడుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా ఇతర వాటికి ఆహారాలుగా కూడా మారుతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. ఒక జంతువు మరో జంతువుకు ఆహారంగా ఏదో రోజు మారిపోవాల్సిందే. అలాగే ఒక పక్షి లేదా జంతువు తన ఆకలి తీర్చుకోవడం కోసం పోరాటం చేయడంతో పాటుగా అదే సమయంలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రతి జంతువు ప్రతిక్షణం పోరాడాల్సి వస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో అందుకు చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఒక నీటి కొలను ఒడ్డున కొంగ వాలుతుంది. దాన్ని ఒక అలిగేటర్ చూస్తుంది. అలిగేటర్ అంటే మొసలిలోనే ఒక రకం. ఆ అలిగేటర్ చిన్నగా వెళ్లి ఆ కొంగను నోట కరుచుకుందామనుకొని మెల్లిగా అడుగులు వేస్తూ కొంగవైపు వెళుతూ ఉంటుంది. కానీ ఇంతలో పొదల్లోంచి బయటకు వచ్చిన ఒక పెద్ద మొసలి ఈ అలిగేటర్ ను చూస్తుంది. వెనుక నుంచి వేగంగా వచ్చేసి అలిగేటర్ ను నోట కరుచుకుంటుంది.

అక్కడి నుంచి నీటిలోకి తీసుకెళ్లి దాన్ని మింగేస్తుంది. ఈ మొత్తం గేమ్ లో కొంగ సురక్షితంగా బయటపడింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఆ వీడియో వైరల్ అవడంతో కొందరు నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తుండగా మరికొందరు జోకులు వేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఆ వీడియో పై స్పందిస్తూ ఎప్పటినుంచో కొంగలు ముసలు రెండు మంచి ఫ్రెండ్స్ అలాంటి వాటికి హాని తలపెడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేసాడు. ఇంకొందరు ఆహారం కోసం వెతుక్కుంటూ పోయి తానే ఆహారం అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.