Airplane Under Bridge : బ్రిడ్జి కింద విమానం జామ్.. ఎలా ?

Airplane Under Bridge :  విమానం.. ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఔను.. గాల్లో ఎగరాల్సిన విమానమే అది.

  • Written By:
  • Updated On - December 30, 2023 / 01:41 PM IST

Airplane Under Bridge :  విమానం.. ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. ఔను.. గాల్లో ఎగరాల్సిన విమానమే అది. కానీ చాలా పాతది. ఇప్పుడు పనిచేయడం లేదు. దీంతో పాత ఇనుప సామానులో జమ చేసేందుకు దాన్ని లారీలో తీసుకెళ్తుండగా రోడ్డు మార్గంలోని ఒక వంతెన కింది నుంచి బయటికి తీయడం కష్టతరమైంది. ఈ ఘటన బీహార్‌లోని మోతిహారిలో చోటుచేసుకుంది. స్థానిక ఆటో డ్రైవర్లు , ట్రక్కు డ్రైవర్లు, స్థానికుల సహకారంతో వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని ఎలాగోలా బయటకు తీశారు. వినియోగం ఆపేసిన ఈ పాత విమానం స్క్రాప్‌ను ముంబై నుంచి అస్సాంకు భారీ ట్రక్కులో తరలిస్తుండగా.. మార్గం మధ్యలో బీహార్‌లోని మోతిహారిలో పిప్రకోటి వంతెన కింద విమానం బాడీ ఇరుక్కుపోయింది.ఈవిషయం తెలియడంతో విమానాన్ని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. లారీ డ్రైవర్లు స్థానికుల సహాయంతో దానిని బయటకు తీశారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీనికి సంబంధించిన  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

  • 2022 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో రోడ్డు మార్గంలో పాత విమానంతో  వెళ్తున్న ట్రక్కు  అండర్‌పాస్‌లో ఇరుక్కుపోయింది. ఆ విమానాన్ని  కొచ్చి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రెస్టారెంట్ పిస్తా హౌస్ యజమాని కేరళలో జరిగిన వేలంలో ఈ విమానాన్ని కొన్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ విమానంలో రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.
  • 2021 అక్టోబర్ లో ఎయిర్ ఇండియా A320 పాత విమానాన్ని ట్రక్కులో తరలిస్తుండగా ఢిల్లీ విమానాశ్రయానికి సమీపంలోని వంతెన కింద చిక్కుకుంది.

Also Read: Deaths In Mansion : 50 కోట్ల భవనంలో తల్లి, తండ్రి, కూతురి మిస్టరీ డెత్ ?