Site icon HashtagU Telugu

Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికుడు భోజనంలో బ్లేడ్‌

Air India

Air India

Air India: బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న విమానంలో అందించిన భోజనంలో మెటల్ బ్లేడ్ ఉన్నట్లు ఓ ప్రయాణికుడు గుర్తించాడు. జూన్ 9న AI 175 విమానంలో ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ మాథుర్స్ పాల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఎయిర్ ఇండియా విమానంలో క్యాటరింగ్ అందించే ఫిగ్ చాట్ డిష్‌లో బ్లేడ్ ఉన్నట్లు పాల్ పేర్కొన్నాడు. నేను దానిని రెండు లేదా మూడు సెకన్ల పాటు నమిలిన తర్వాత అది నా ఆహారంలో ఉందని నేను గ్రహించానని పాల్ పేర్కొన్నాడు. విమానంలో అందించే ఆహారంలో బ్లేడ్ ఉండటం ప్రమాదకరం. ఆహారాన్ని తింటున్న సమయంలో నాలుక కోసుకునే ప్రమాదం ఉంది. అదే ఆహారం చిన్నపిల్లవాడికి ఇస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేశాడు పాల్.

ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియా విమానంలో అనేక సమస్యలతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అపరిశుభ్రమైన క్యాబిన్‌లు, సరిగా పనిచేయని వ్యవస్థలు మరియు నాణ్యమైన భోజనం అందించకపోవడం లాంటి తప్పిదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా బిజినెస్ క్లాస్ ప్రయాణీకులు ముఖ్యంగా టిక్కెట్ల అధిక ధరకు సంబంధించిన సమస్యలను నివేదిస్తున్నారు.

Also Read: Mr Bachchan : రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ గ్లింప్స్ వచ్చేసింది.. హరీష్ శంకర్ అదరగొట్టేసాడుగా..