Site icon HashtagU Telugu

AI Technology : 60 ఏనుగుల ప్రాణాలను కాపాడింది

60 Elephants Crossing The R

60 Elephants Crossing The R

టెక్నలాజి ( Technology) అనేది రోజు రోజుకు ఎంతగా అభివృద్ధి (Development) చెందుతుందో తెలియంది కాదు..ప్రతి రోజు వందల సంఖ్యలో సరికొత్త టెక్నలాజి టూల్స్ అందుబాటులోకి వచ్చి ఆశ్చర్య పరుస్తున్నాయి. పదిమంది చేసే పనిని పది సెకన్లలో చేసే టెక్నలాజి వచ్చి ..చాలామందికి శ్రమ లేకుండా చేస్తున్నాయి. ఈ టెక్నలాజి వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో..అంతకు మించి అపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏఐ టెక్నలాజి అందుబాటులోకి వచ్చాక..నమ్మలేనివి ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా 60 ఏనుగుల (60 elephants) గుంపును ఈ టెక్నలాజి ద్వారా కాపాడగలిగారు.

15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి (15959 Kamrup Express) నుంచి లుమ్‌డింగ్‌కు వెళ్తుండగా.. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్ (Loco Pilot ), అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ విజ్ఞత చూపకపోతే చాలా ఏనుగులు చనిపోయి రైలు కూడా ఢీకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏనుగులన్నీ మెల్లగా రైల్వే ట్రాక్ దాటుతున్న దృష్యాన్ని వీడియోలో చూడొచ్చు. చిమ్మ చీకటిలో వేగంగా వెళ్తున్న రైలులో నుంచి లోకో పైలట్లు ఏనుగులను గమనించడానికి కారణం ఏఐ బేస్డ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఈ సేఫ్టీ సిస్టమ్ ముందుగా అలెర్ట్ ఇవ్వడంతో లోకో పైలట్లు రైలు వేగాన్ని తగ్గించారు. ఆ తర్వాత ఏనుగులను చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఏనుగుల ప్రాణాలను కాపాడిన లోకో పైలట్లు ను అందరు ప్రశంసిస్తున్నారు.

Read Also : Indigo Flight : 5 గంటలుగా విమానంలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు