Site icon HashtagU Telugu

100 Hours Cooking : ఆమె అన్ స్టాపబుల్.. 100 గంటలు నాన్‌స్టాప్‌ కుకింగ్

100 Hours Cooking

100 Hours Cooking

అన్ స్టాపబుల్ అంటే ఇదే .. 10 గంటలు కాదు.. 30 గంటలు కాదు.. ఏకంగా 100 గంటలు వంట (100 Hours Cooking) చేసి నైజీరియాలోని లాగోస్‌ సిటీకి  చెందిన మహిళా చెఫ్ హిల్డా బాసి రికార్డు సృష్టించింది. గత గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వంట చేయడం ప్రారంభించిన ఆమె.. సోమవారం ఉదయం 7.45 నిమిషాల వరకు (100 గంటలు) అన్ స్టాపబుల్ గా  వంట(100 Hours Cooking) చేసింది. దీంతో ఆమె గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కింది.

ALSO READ : Guinness Record: 9 ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డు.. 4 సెకన్లలోనే రూబిక్స్ క్యూబ్‌ పరిష్కారం

భారతీయ చెఫ్ రికార్డు బ్రేక్..  

ఇంతకుముందు 2019లో భారతీయ చెఫ్ లతా టొండన్ నెలకొల్పిన 87 గంటల 45 నిమిషాల గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను హిల్డా బాసి బద్దలు కొట్టింది. ఈ 100 గంటల వ్యవధిలో నైజీరియాకు చెందిన ప్రత్యేక వంటలను ఆమె సిద్ధం చేసింది. దీంతో  బాసిని చూసేందుకు వేలాది మంది ప్రజలు ఆమె ఇంటి దగ్గర గుమిగూడారు. యూట్యూబ్, స్థానిక టీవీ ఛానళ్లలో ఆమె వంటల కార్యక్రమం ప్రసారం చేశారు. బాసిని అభినందిస్తూ నైజీరియా అధ్యక్షుడు ముహ్మద్ బుహారీ ట్వీట్ చేశారు.