Site icon HashtagU Telugu

Flight Emergency Landing : ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి దింపిన డైపర్‌

Flight Emergency Landing

Flight Emergency Landing

డైపర్‌ ఏంటి విమానాన్ని కిందకు దింపడం ఏంటి అనుకుంటున్నారా..? అవును విమానంలోని టాయిలెట్ (Flight Toilet) లో కనిపించిన అడల్డ్ డైపర్‌ (Adult Diaper) ప్రయాణికులను , సిబ్బందిని గందరగోళానికి గురి చేసి..ఆకాశం నుండి కిందకు అత్యావసరంగా ల్యాండ్ అయ్యేలా చేసింది. ఈ ఘటన అమెరికా లో చోటుచేసుకుంది. డైపర్‌ అనగానే చాలామందికి చిన్నపిల్లలకు వేసేదే గుర్తుకొస్తుంది..కానీ పెద్దవారు కూడా ఈ డైపర్ లను వాడుతుంటారు. ఆరోగ్య పరిస్థితులు బాగోని నేపథ్యంలో ఈ అడల్ట్‌ డైపర్‌ లను ఉపయోగిస్తుంటారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా అమెరికా(America) లోని పనామా సిటీ (Panama) నుంచి ఫ్లోరిడా(Flourida)లోని తంపాకు విమానం బయలుదేరింది. విమానం టేకాఫ్‌ అయిన గంట తరువాత విమానంలోని టాయిలెట్‌ లో ఓ ప్రయాణికుడికి ఓ అనుమానస్పద వస్తువు కనిపించింది. దాని గురించి విమాన సిబ్బందికి సమాచారం అందించాడు. దాంతో వారు దానిని చూసి బాంబుగా భావించి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి పైలట్‌ దృష్టికి తీసుకెళ్లగా..వెంటనే ఫైలెట్ విమానాశ్రయా సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో వారు పనామాలోనే అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులను (Passengers) కిందికి దించి విమానంలో బాంబ్‌ స్క్వాడ్‌ గాలింపు చేపట్టింది. టాయిలెట్‌ లో గుర్తించిన అనుమానాస్పద వస్తువును అడల్ట్‌ డైపర్‌ గా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం మళ్లీ బయల్దేరి వెళ్లింది.

Read Also :