Google Map : గూగుల్ తల్లి సాయంతో దొంగను పట్టుకున్న యువకుడు..

  • Written By:
  • Publish Date - February 5, 2024 / 01:38 PM IST

ఒకప్పుడు ఏదైనా అడ్రెస్స్ కావాలంటే కనిపించినవారినల్లా అడుగుతూ వెళ్లే వాళ్ళం..కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యామా..గూగుల్ తల్లి సాయంతో ఎక్కడికి వెళ్లిన ఎవర్ని అడగకుండా మనం వెళ్లాల్సిన అడ్రెస్ కు వెళ్తున్నాం. ఇప్పటివరకు కేవలం ప్రదేశాలను మాత్రమే గూగుల్ మ్యాప్ చూపిస్తుందని అనుకున్నాం..కానీ ఇప్పుడు ఓ దొంగను కూడా పట్టిస్తోందని తాజాగా బయటపడింది. రైల్లో ఓ దొంగ..బ్యాగ్ కొట్టేసి పారిపోయాడు..దీంతో ఆ యజమాని కొడుకు గూగుల్ మ్యాప్ తో ఆ దొంగను పట్టుకున్నాడు..ఇది ఎలా జరిగిందో తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

‘‘మా నాన్న నాగర్‌కోయిల్ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో నాగర్ కోయిల్ నుంచి తిరుచ్చి వెళ్తున్నారు. నాగర్ కోయిల్ జంక్షన్లో ఆయన అర్ధరాత్రి 1.43 గంటలకు రైలెక్కారు. ఆయన ఎక్కిన రైలు బోగీ దాదాపు ఖాళీగా ఉంది. నాన్నతోపాటు రైలెక్కిన ఓ వ్యక్తి నాన్న దగ్గర్నుంచి బ్యాగ్‌‌తోపాటు ఫోన్‌ను కొట్టేసి తిరునెల్వేలి జంక్షన్లో దిగిపోయాడు. బ్యాగ్, ఫోన్ కనిపించడం లేదనే విషయాన్ని గ్రహించిన నాన్న రైల్లో వెతికారు. దొరక్కపోవడంతో 3 గంటల 51 నిమిషాల సమయంలో తన స్నేహితుడి ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి దొంగతనం గురించి చెప్పారు. లక్కీగా మా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య లొకేషన్ షేరింగ్ ఆన్‌లో ఉంది. దీంతో మా నాన్న ఫోన్‌ లొకేషన్‌ను నేను ట్రాక్ చేయగలను. వెంటనే నేను ట్రాకింగ్ మొదలుపెట్టాను. నాన్న ఫోన్ తిరునెల్వేలిలోని మేళపాల్యం సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గర కదులుతూ కనిపించింది. దీంతో దొంగ మరో రైల్లో నాగర్ కోయిల్ వస్తున్నాడని అర్థమైంది. స్థానిక డీఎంకే నాయకుడైన నా స్నేహితుడు బబిన్‌కు కాల్ చేసి సాయం చేయమని కోరాను. దొంగను పట్టుకోవడానికి మేం ఇద్దరమూ కలిసి నాగర్ కోయిల్ స్టేషణ్‌కు వెళ్లాం. మేం చెప్పింది విని రైల్వే పోలీసులు తమ సిబ్బందిని ఒకరిని మాతో పంపించారు.

We’re now on WhatsApp. Click to Join.

నాన్న బ్యాగ్, ఫోన్ కొట్టేసిన దొంగ కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో స్టేషన్‌కు వచ్చాడు. అప్పుడు జనం ఎక్కువగా ఉండటంతో.. ఆ దొంగను గుర్తించడం కష్టంగా మారింది. గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్‌తోపాటు నాన్న బ్లాక్ కలర్ బ్యాగ్‌ను గుర్తుపడితేనే అతణ్ని పట్టుకోగలను. కాసేపటికి ఆ దొంగోడు రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ దాటి అన్నా బస్టాండ్‌కు వెళ్లే లోకల్ బస్సెక్కాడు. దీంతో అతణ్ని అనుసరిస్తూ మేం బైక్‌పై బయల్దేరాం.

లొకేషన్‌ను బట్టి చూస్తే.. కొద్ది దూరంలో అతడి వెనుకాలే ఉన్నామని అర్థమైంది. 2-3 నిమిషాల తర్వాత అతడు మాకు రెండు మీటర్ల దూరంలోనే ఉన్నాడని గూగుల్ మ్యాప్స్‌ను బట్టి తెలిసింది. ఆ సమయంలో నేను సరిగ్గా అతడి వెనకే ఉన్నాను. నాన్న బ్యాగ్‌‌పై ఉన్న సీఐటీయూ అనే అక్షరాలతోపాటు లోగోను గమనించాను. వెంటనే నేను, నా స్నేహితుడు కలిసి బస్టాండ్లోనే దొంగను పట్టుకున్నాం. అక్కడున్న వారు మాకు సహకరించారు. దీంతో మా నాన్న ఫోన్, బ్యాగ్‌ను మేం రికవరీ చేశాం’’ అని తమిళనాడుకు చెందిన రాజ్‌ భగత్ అనే సివిల్ ఇంజనీర్ చెప్పుకొచ్చాడు. ఇలా గూగుల్ తల్లి తన తండ్రి ఫోన్ తో పాటు బ్యాగ్ ను పెట్టుకునేలా చేసిందని చెప్పుకొచ్చాడు.

Read Also : Rs 20500 Crores Lose : 3 రోజుల్లో 20వేల కోట్లు ఆవిరి.. పేటీఎం షేర్ల ‘పతన పర్వం’