Five Snakes In Bra : రకరకాలుగా స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన వాళ్ళను మనం చూస్తుంటాం..
స్మగ్లర్లను పట్టుకోవడానికి పోలీసులు ఎంతగా అప్ డేట్ అవుతున్నారో..
పోలీసులకు చిక్కకుండా స్మగ్లర్లు కూడా అంతగా కొత్త కొత్త పద్ధతులను సిద్ధం చేసుకుంటున్నారు..
పాములను స్మగ్లింగ్ చేసే ఆ మహిళ కొత్త ఐడియా రెడీ చేసుకుంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లైవ్ పాములను తన బ్రాలో పెట్టుకొని బయలుదేరింది..
Also read : Sharad Pawar Skip : తొలిరోజు విపక్షాల మీటింగ్ కు శరద్ పవార్ దూరం
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ షెన్‌జెన్ సిటీలో ఉన్న ఫుటియన్ ఎయిర్ పోర్ట్ అది.. అక్కడికి ఒక మహిళ వచ్చింది. ఆమె శరీర ఆకృతిలో ఏదో తేడా ఉందని విమానాశ్రయ అధికారులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి ఆమెను మహిళా తనిఖీ విభాగానికి పంపించారు. ఆ మహిళను చెక్ చేయగా బ్రా నుంచి బతికి ఉన్న 5 పాము పిల్లలు(Five Snakes In Bra) బయటపడ్డాయి. ఆ 5 పాము పిల్లలను ఒక్కో గోనె సంచిలో విడివిడిగా ప్యాక్ చేసి బ్రాలో పెట్టుకుందని వెల్లడైంది. దీంతో విమానాశ్రయ అధికారులు షాక్ కు గురయ్యారు. ఆ పాములను జంతువుల సంరక్షణ శాఖకు అప్పగించారు.
Also read : Twitter VS Threads: ట్విట్టర్ లో లేని ఈ 6 ఫీచర్లు థ్రెడ్స్ యాప్ లో ఉన్నాయి.. అవేంటో తెలుసా..?
ఈ పాముల గురించి..
కార్న్ స్నేక్స్ జాతికి చెందిన ఈ పాములు 24 అంగుళాల నుంచి 72 అంగుళాల పొడవు దాకా పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఇవి నారింజ, గోధుమ, పసుపు రంగుల్లో ఉంటాయని, వీటి బొడ్డు వెంట నలుపు-తెలుపు “చెకర్‌బోర్డ్” నమూనా ఉంటుందన్నారు. ఈ పాములు విషపూరితం కానివి, అందుకే మహిళా స్మగ్లర్ ధైర్యంగా బ్రాలో పెట్టుకుందని తేలింది. అట్రాక్టివ్ గా ఉండే ఈ పాములను చాలా ఉత్తర అమెరికా దేశాల్లో ఇళ్లలో పెంచుకుంటారు. అందుకే వీటిని చైనా నుంచి నిత్యం స్మగ్లింగ్ చేస్తుంటారు. కాగా, గతంలో మన దేశంలోని చెన్నై విమానాశ్రయంలోనూ పాములు, కోతులు, తాబేళ్లు ఉన్న బ్యాగులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.