Site icon HashtagU Telugu

Viral Video: మేక కోసం టికెట్ కొనుగోలు చేసిన మహిళ, శభాష్ అంటున్న నెటిజన్స్!

Viral

Viral

Viral Video: ఓ మహిళ మేకతో రైలు ప్రయాణం చేసింది. అయితే సాధారణంగా చాలామంది తమ పెట్స్ తో ప్రయాణం చేసేటప్పుడు, వాటి కోసం టికెట్ కొనుగోలు చేయకుండా దర్జాగా ప్రయాణం చేస్తుంటారు. కానీ ఈ మహిళ తన మేక కోసం రైలు టిక్కెట్‌ను కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన వీడియో వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (TTE) మేక కోసం టికెట్ కొన్నారా అని అడిగినప్పుడు ఆమె నవ్వుతూ నమ్మకంగా సమాధానం ఇస్తుంది. సంభాషణ బెంగాలీలో జరిగినందున పశ్చిమ బెంగాల్ గుండా రైలు వెళ్తున్నట్టు తెలుస్తోంి.

“ఆమె తన మేక కోసం రైలు టిక్కెట్‌ను కూడా కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని టిటిఇకి గర్వంగా చెబుతుంది. ఆమె చిరునవ్వు చూడండి. అద్భుతం” అని అవనీష్ శరణ్ ట్విట్టర్‌లో వీడియోను పోస్ట్ చేస్తూ అన్నారు. “ఆమె ఎంత నిజాయితీపరురాలు. నిజంగా, దేశం అలాంటి వారిని కోరుకుంటుంది” అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Skanda Release Date: రామ్-బోయపాటి ‘స్కంద’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే!

Exit mobile version