Fact Check : ‘లవ్ జిహాద్’ పేరుతో ముగ్గురు అమ్మాయిల కిడ్నాప్.. కాపాడిన యువకుడు.. నిజమేనా ?

యువతులను దాచిన ఇంట్లోకి ఒక యువకుడు వెళ్లి వారిని విడిపించినట్లుగా వీడియోలో చూపించారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Fact Check) అవుతోంది.

Published By: HashtagU Telugu Desk
Girls Kidnap Love Jihad fact Check Newsmeter Shakti Collective

Fact Checked By newsmeter

ప్రచారం : మనుషుల అవయవాలను విక్రయించే మాఫియా చెర నుంచి  హిందూ బాలికలను ఓ యువకుడు రక్షించాడు అని వీడియోలో చూపించారు.

వాస్తవం: ఆ ప్రచారం తప్పు. ఒరిజినల్ వీడియోను ఎడిట్ చేసి విషయాన్ని తప్పుదోవ పట్టించారు.

Also Read :One Nation One Election: జమిలి ఎన్నికల బిల్లులు.. అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు

ముగ్గురు యువతులు కిడ్నాప్‌కు గురయ్యారని.. వారిని ఓ ఇంట్లో దాచారని ఆ వీడియోలో ఉంది. యువతులను దాచిన ఇంట్లోకి ఒక యువకుడు వెళ్లి వారిని విడిపించినట్లుగా వీడియోలో చూపించారు.  ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Fact Check) అవుతోంది. ‘లవ్ జిహాద్’ పేరుతో ఆ యువతులను కిడ్నాప్ చేసి. మనుషుల అవయవాలను అమ్ముకునే మాఫియాకు అప్పగించారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది.

ఒక ఫేస్‌బుక్ వినియోగదారుడు ఈ  వీడియోను షేర్ చేసి..  “జాగ్రత్త.. వాళ్లు లవ్ జిహాద్‌ పేరుతో అమాయక హిందూ యువతులను కిడ్నాప్ చేస్తున్నారు. హిందూ  యువతులను చంపి వాళ్ల శరీర భాగాలను అమ్మి రూ. 70 లక్షల నుంచి రూ.90 లక్షల దాకా సంపాదిస్తున్నారు’’ అని రాశాడు.  ( ఆర్కైవ్ )

ఇలాంటి దావాలు ఇక్కడ మరియు ఇక్కడ కనుగొనబడ్డాయి . ( ఆర్కైవ్ 1 ) ( ఆర్కైవ్ 2 )

Also Read :NTA Update : ఎన్‌టీఏ ‘ఎంట్రెన్స్‌’లకే పరిమితం.. రిక్రూట్‌మెంట్ పరీక్షలు నిర్వహించదు: కేంద్రం

వాస్తవ తనిఖీ..

ఆ  ప్రచారమంతా తప్పు అని న్యూస్‌మీటర్ టీమ్ గుర్తించింది. ఆ వీడియోలో ఉన్నది ఒక కల్పితమైన స్కిట్ అని తేలింది.

7:13 నిమిషాల నిడివి కలిగిన ఈ వైరల్ వీడియో ప్రారంభంలో.. ‘‘ఈ వీడియోలోని కంటెంట్‌ను కేవలం వినోదం కోసమే పరిగణించాలి’’ అనే గమనిక డిస్‌ప్లే అవుతుంది. దీన్నిబట్టి ఈ వీడియోలోని స్క్రిప్ట్‌ నిజమైంది కాదని.. కల్పితమైంది అని తేటతెల్లమైంది.

వీడియో కీఫ్రేమ్‌లకు సంబంధించిన రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి.. 2023 ఫిబ్రవరి 12న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి ఫైల్‌ను  మేం గుర్తించాం.  ఈ వీడియోను నవీన్ జంగ్రా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్‌లోడ్ చేశారు. ‘‘అమ్మాయిలు ఎలా కిడ్నాప్ చేయబడతారో.. కిడ్నాప్ అయ్యాక ఏమి చేస్తున్నారో చూడండి..’’ అని ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.

ఈ YouTube ఛానల్‌కు సంబంధించిన మరో వైరల్ క్లిప్‌ను మేము తనిఖీ చేశాం. అందులో ఉన్న నటీనటులు.. లవ్ జిహాద్‌కు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలోని నటీనటులు ఒక్కరే అని మేం గుర్తించాం. అందుకోసం మీరు  YouTube ఛానెల్ నుండి ఒక వీడియోను  చూడొచ్చు.

మొత్తం మీద ఈ వీడియో అనేది నటన ఆధారితమైందని.. అందులో వాస్తవిక సన్నివేశాలు లేవని వెల్లడైంది.

క్లెయిమ్ ఫాక్ట్ చెక్: ఇది తప్పుడు ప్రచారం. ఆ వీడియోలోని వారంతా నటీనటులు. అవి వాస్తవిక సన్నివేశాలు కావు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా న్యూస్ మీటర్’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 

  Last Updated: 17 Dec 2024, 04:49 PM IST