హనుమకొండ జిల్లా (Hanumakonda District) పరకాల (Parakala ) పట్టణంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ చిలుక జోస్యం (Parrot Prophecy) చెప్పే సందర్భంలో జరిగిన మాట మాట యుద్ధం.. ఇద్దరు వ్యక్తుల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. జ్యోతిష్యుడు రామస్వామి తన చిలుకతో జోస్యం చెప్పేందుకు మెకానిక్ దాస్ వద్దకు రాగా, చిలుక చూపించిన బొమ్మ ఆధారంగా తాయత్తు కడతానని రూ.1,650 డిమాండ్ చేశాడు. కానీ దాస్ అప్పటికే ఖాళీ లేకపోవడంతో తర్వాత రమ్మని చెప్పి పంపించేశాడు.
Man Cuts off Wife’s Braid : భార్య జడ కోసేసిన భర్త..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..కారణం అదే !
మధ్యాహ్నం సమయంలో రామస్వామి తిరిగి చిలుకతో మెకానిక్ షాపుకు చేరుకున్నాడు. ఈసారి చిలుకను బొమ్మ తీయమని చెప్పి, జ్యోతిష్యుడు కళ్లు మూసి ప్రార్థన మొదలెట్టాడు. అంతలోనే పక్కనే ఉన్న బైక్ టైరు పేలిన శబ్దానికి భయపడి చిలుక పంజరాన్ని వదిలి ఎగిరిపోయి సెల్ టవర్ మీద వాలింది. చిలుక తిరిగి రావడం లేదని జ్యోతిష్యుడు ఆందోళన చెందాడు.
చిలుక నీవల్లే పోయిందంటూ దాస్‌ను నిందించగా, ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. చివరికి ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే స్థానికులు జోక్యం చేసుకుని వారిద్దరిని నచ్చజెప్పడంతో గొడవ అక్కడితో ఆగిపోయింది. ఈ విచిత్ర సంఘటన పరకాలలో హాట్ టాపిక్‌గా మారింది. చిలుక వల్ల ఇలాంటి ఘర్షణ జరగడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.