నింగిలో ఎన్నో ఆశ్చర్యాలు దాగి ఉంటాయి. వాటిలో ఒక అద్భుతం ఈ సోమవారం రాత్రి కనువిందు చేయనుంది. 2025లో తొలి సూపర్ మూన్ (Super Moon) అక్టోబర్ 6, 7 తేదీలలో కనిపించనుంది. సాధారణ పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడి కంటే ఈ సమయంలో చంద్రుడు భూమికి మరింత దగ్గరగా వస్తాడు. అందువల్ల చంద్రుని పరిమాణం, కాంతి రెండూ సాధారణం కంటే ఎక్కువగా అనిపిస్తాయి.
Road Accident : ORR పై ఘోర ప్రమాదం.. వరుసగా ఢీకొన్న 7 కార్లు
భూమి చుట్టూ చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ కొన్నిసార్లు దూరంగా, కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉండి, అదే సమయంలో పౌర్ణమి అయితే దాన్ని ‘సూపర్ మూన్’ అంటారు. ఈసారి సాధారణ పౌర్ణమితో పోలిస్తే చంద్రుడు సుమారు 14% పెద్దగా, 30% ఎక్కువ వెలుగుతో మెరిసిపోతాడు. ఈ ప్రకృతి అద్భుతాన్ని కళ్లారా చూడటానికి ప్రత్యేక పరికరాల అవసరం లేకుండా నేరుగా ఆకాశాన్ని పరిశీలించడం చాలు.
2025లో మొత్తం మూడు సూపర్ మూన్స్ ఏర్పడతాయి. అక్టోబర్‌లో మొదటి సూపర్ మూన్ తర్వాత నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో రెండు సూపర్ మూన్స్ చూడగలము. ప్రకృతి ప్రేమికులు, ఖగోళ శాస్త్రాభిమానులు ఈ అరుదైన దృశ్యాలను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భాల్లో ఆకాశ వీక్షణం మరింత రమ్యంగా అనిపించబోతోంది.
