Site icon HashtagU Telugu

Super Hero: 1500 అడుగల టవర్ ను అవలీలగా ఎక్కేస్తున్న వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్!

Viral

Viral

నలభై అడుగుల టవర్ ఎక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. కానీ 1500 అడుగుల టవర్ ఎక్కాలంటే ఎవరైనా భయపడిపోతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఐ యామ్ రెడీ అంటూ రిస్క్ చేస్తున్నాడు. లైకుల కోసమో, సోషల్ మీడియాలో హీరో అయిపోవడానికో టవర్ ఎక్కడం లేదు. తన డ్యూటీలో భాగంగా టవర్ ఎక్కుతానని చెప్తున్నాడు. కెవిన్ ష్మిత్ అనే వ్యక్తి టవర్ పై కేవలం బల్బును మార్చడం కోసం ఈ కఠినమైన రిస్క్ చేస్తున్నాడు. సియోక్స్ ఫాల్స్ టవర్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ష్మిత్ ఉద్యోగం చేస్తున్నాడు.

అతను ఎక్కడానికి 20,000 డాలర్లు (రూ. 16.5 లక్షలు) డబ్బు తీసుకుంటున్నప్పటీ,  చాలామంది అలాంటి విన్యాసాలు చేయడానికి కూడా సాహసించరు. కానీ ష్మిత్ మాత్రం అలవోకగా ఎక్కేస్తూ టెలివిజన్ ప్రసార యాంటెన్నా పైభాగంలో లైట్ బల్బును మారుస్తూ కనిపించాడు. గత ఎనిమిది సంవత్సరాలుగా 1,500 అడుగుల (457 మీటర్లు) ఎత్తులో ఉన్న టవర్ ఎక్కుతూ, అందరి ద్రుష్టిని ఆకర్షిస్తన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయ్యండి. అతనో సూపర్ హీరో, ఆయన డేడికేషన్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bandi Sanjay: టికెట్లు కావాలంటే ప్రజల మధ్య ఉండాల్సిందే: బండి సంజయ్ వార్నింగ్