Pakistan: వరుడి ఐడియా దెబ్బకు మెరిసిపోతున్న వధువు.. ఫొటోస్ వైరల్?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. అలాంటి వాళ్లను

  • Written By:
  • Publish Date - September 7, 2023 / 03:20 PM IST

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి విషయంలో ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. అలాంటి వాళ్లను భర్తగా చేసుకోవాలి భార్యగా చేసుకోవాలి అలా గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఇలా ఎన్నో రకాల కలలు కంటూ ఉంటారు. అందుకే జీవితాంతం గుర్తుండిపోయేందుకు కొందరు భారీగా ఖర్చు పెట్టి మరీ వివాహ వేడుకను జరుపుతూ ఉంటారు. కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే వరుడు మాత్రం వివాహానికి ముందు జరిగే మెహందీ వేడుకలో తనకు కాబోయే భార్య అందంగా మెరిసిపోవాలని అనుకున్నాడు.

అందుకు వినూత్నంగా ఆలోచించాడు. పాకిస్థాన్‌ కు చెందిన ఒక వరుడు తనకు వధువుపై అమితమైన ప్రేమను ప్రదర్శించాడు. ఈ క్రమంలో ఒక వినూత్న ఆలోచనతో ఆమె ధరించే దుస్తులను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించాడు. అయితే, ఆ దుస్తులకు ఎల్‌ఈడీ లైట్లను జోడించాడు. వధువు ఆ వస్త్రాలను ధరించి వేడుకలో పాల్గొంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తన భర్త చూపిన ప్రేమను వివరించింది. మా జీవితంలో అతి ముఖ్యమైన రోజు కోసం నా భర్త ఈ దుస్తులను నా కోసం స్వయంగా డిజైన్‌ చేశారు. ఎల్‌ఈడీ లైట్లతో కూడిన ఈ దుస్తులను ధరిస్తే అందరూ నవ్వుకుంటారు.

 

కానీ, వాటిని గర్వంగా ధరించాను. ఎందుకంటే ఏ వరుడు వధువు కోసం ఇలాంటి ప్రయత్నం చేయరు కదా అని రాసుకొచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియో పై స్పందించిన పలువురి నెటిజన్స్ నిజంగానే ఐడియా చాలా కొత్తగా ఉంది గురు నిజంగా హాట్స్ ఆఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.