Site icon HashtagU Telugu

Shocking: ముసలోడే కానీ మహానుభావుడు, ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు!

Viral

Viral

ఆయన వయసు 62, ఆమె వయసు 30.. సీన్ కట్ చేస్తే ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు ఓ తాత. ఈ వార్త ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో చోటుచేసుకుంది. ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్‌ గ్రామానికి చెందిన గోవింద్‌ కుష్వాహా (62) రెండో భార్య హీరాబాయి కుష్వాహా (30) సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. సాధారణ ప్రసవం (Delivery) కాకపోవడంతో మంగళవారం ఉదయం వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు.

ఒకే కాన్పులో హీరాబాయి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. గోవింద్‌ కుష్వాహా మొదటి భార్య కస్తూరిబాయికి పుట్టిన కుమారుడు 18 ఏళ్ల వయసున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రస్తుతం ఆమె వయసు 60 ఏళ్లు కావడంతో పిల్లల్ని కనడం అసాధ్యమని భావించింది. అయితే ఆరేళ్ల కిందట కస్తూరిబాయే దగ్గరుండి తన భర్తకు రెండో పెళ్లి జరిపించింది.

ఆరేళ్ల తర్వాత హీరాబాయితో సంసారం చేయడంతో ఏకంగా ముగ్గురు పిల్లలు (3 Childrens) పుట్టారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలు నియోనాటిల్ ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. భగవంతుని ఆశీసులతో పిల్లలు కోలుకుని, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నానని గోవింద్ కుష్వాహా అన్నారు. 11 ఏళ్ల కిందట తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని,. పిల్లల కోసం తన మొదటి భార్య బలవంతంగా రెండో పెళ్లి చేసిందన్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. ముసలోడే కానీ మహానుభావుడు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు, త్రిబుల్ ధమకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bengaluru Thief: మహిళల అండర్ వేర్స్ ను దొంగిలిస్తూ, హస్త ప్రయోగం చేస్తూ!

Exit mobile version