Viral News: మ‌ద్యం మ‌త్తులో లిప్ట్ అడిగిన వ్య‌క్తికి కారు ఇచ్చేశాడు.. ఇంటికెళ్లాక అస‌లు విష‌యం గుర్తుకు రావ‌డంతో ..

మ‌ద్యం మ‌త్తులో డ‌బ్బులు, ఇత‌ర వ‌స్తువుల‌ను పోగొట్టుకున్న వారి గురించి అనేక‌సార్లు విన్నాం. కానీ, ఢిల్లీ(Delhi)కి చెందిన ఓ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో గుర్తుతెలియ‌ని వ్య‌క్తికి లిఫ్ట్ ఇవ్వ‌డ‌మేకాకుండా, అత‌డికే కారు(Car) ఇచ్చేసి తానుమాత్రం ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు.

  • Written By:
  • Publish Date - June 12, 2023 / 10:00 PM IST

మ‌ద్యం(Alcohol) సేవించిన వారు మ‌త్తులో ఏం చేస్తారోకూడా వారికే తెలియ‌దు. మ‌ద్యం మ‌త్తులో చేసేదంతా చేసి మ‌త్తు దిగిన త‌రువాత ప‌శ్చాత్తాప ప‌డుతుంటారు. మ‌ద్యం మ‌త్తులో డ‌బ్బులు, ఇత‌ర వ‌స్తువుల‌ను పోగొట్టుకున్న వారి గురించి అనేక‌సార్లు విన్నాం. కానీ, ఢిల్లీ(Delhi)కి చెందిన ఓ వ్య‌క్తి మ‌ద్యం మ‌త్తులో గుర్తుతెలియ‌ని వ్య‌క్తికి లిఫ్ట్ ఇవ్వ‌డ‌మేకాకుండా, అత‌డికే కారు(Car) ఇచ్చేసి తానుమాత్రం ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికెళ్లాక మ‌త్తు దిగ‌డంతో కారు విష‌యం గుర్తుకురావ‌డంతో ల‌బోదిబోమంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ విచిత్ర ఘ‌ట‌న ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అమిత్ ప్ర‌కాశ్ అనే వ్య‌క్తి ఓ కార్పోరేట్ సంస్థ‌లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్ర‌వారం రాత్రి కారులో కూర్చొని మ‌ద్యం సేవించాడు. అయినా స‌రిపోక‌పోవ‌టంతో ప‌క్క‌నే ఉన్న వైన్ షాపు వ‌ద్ద‌కు వెళ్లి రూ. 2వేల మందు కొనుగోలు చేశాడు. అప్ప‌టికే మ‌ద్యం మ‌త్తు ఎక్క‌డంతో షాపు యాజ‌మానికి రూ.2 వేల‌కు బ‌దులు రూ.20వేలు ఇచ్చాడు. స‌ద‌రు షాపు యాజ‌మాని గుర్తుచేసి మ‌రీ తిరిగి 18వేలు అమిత్ ప్ర‌కాశ్ కు ఇచ్చేశాడు. రోడ్డు ప‌క్క‌న కారులో కూర్చొని మ‌ద్యం తాగుతున్న అమిత్ ప్ర‌కాశ్ వ‌ద్ద‌కు ఓ వ్య‌క్తి వ‌చ్చి లిఫ్ట్ కావాల‌ని అడిగాడు. అమిత్ కారు కీ ఇచ్చి డ్రైవ్ చేయ‌మ‌న్నాడు. దీంతో ఆ వ్య‌క్తి కారును డ్రైవ్ చేశాడు. అలా కొద్దిదూరం వెళ్లాక‌.. అమిత్ పీక‌ల్లోతు మ‌త్తులో ఉండ‌టాన్ని గ‌మ‌నించిన స‌దురు వ్య‌క్తి అమిత్‌ను కారును దిగిపోవాల‌ని ఆదేశించాడు. అమిత్ సైతం కారు వేరేవారిద‌నుకొని దిగిపోవ‌డంతో గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కారుతో ఉడాయించాడు.

కారు దిగిన త‌రువాత అమిత్ ఆటోలో ఇంటికెళ్లాడు. ఇంటికెళ్లాక మ‌ద్యం మ‌త్తు దిగ‌డంతో కారు విష‌యం గుర్తుకొచ్చింది. తాను మ‌ద్యం మ‌త్తులో ఉండ‌టంతో ఎవ‌రో త‌న కారును కొట్టేశార‌ని గ్ర‌హించి ల‌బోదిబోమంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. పోలీసులు సీసీ కెమెరాల‌ను ప‌రిశీలించి కేసు న‌మోదు చేశారు. కారుతో ఉడాయించిన వ్య‌క్తికోసం గాలింపు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మార‌డంతో అమిత్ చేసిన ప‌నిప‌ట్ల నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

 

Also Read : Delhi: ట్రాఫిక్ రూల్స్ పై వినూత్న ప్రయోగం చేసిన పోలీసులు.. వీడియో వైరల్?