Site icon HashtagU Telugu

Smoke Biscuit : స్మోక్ బిస్కెట్ తిని ఓ బాలుడు మృతి..తల్లిదండ్రులు జాగ్రత్త

Smoke Biscuit Kid Dies

Smoke Biscuit Kid Dies

ఈ మధ్య ఎక్కడ చూసిన స్మోక్ బిస్కెట్స్ (Smoke Biscuit) అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాతర సమయంలో వీటిని అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. బిస్కెట్ తినగానే నోటిలోంచి అదే విధంగా ముక్కులోంచి పొగలు రావడంతో పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటూ సెల్ఫీలతో సందడి చేసుకుంటున్నారు. బిస్కెట్లు తినే వాళ్లను చూస్తే మనకు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాల్లో ఎక్కువగా ఇలాంటివి చూసిన జనాలు..కళ్లముందు కనిపించేసరికి ఏమాత్రం ఆగకుండా తింటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కానీ వీటిని తినడం వల్ల ప్రాణాలు కూడా పోతాయిని తాజాగా జరిగిన ఘటన తో అంత మేలుకుంటున్నారు. తాజాగా స్మోక్ బిస్కెట్ తిని బాలుడు చనిపోయినా ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వీడియో చూస్తే.. ఒక చిన్న పిల్లవాడు పబ్లిక్ ఏరియాలోని స్టాల్‌లో బిస్కెట్లు తాగుతూ కనిపించాడు. అయితే ఆ పొగబెట్టిన బిస్కెట్ తినడం వల్ల కొన్ని క్షణాల్లోనే ఆ బాలుడు నొప్పితో అరుస్తూ సహాయం కోరుతూ కనిపించాడు. అతని ఆరోగ్యం క్షీణించినట్లు గమనించిన పేరెంట్స్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పొగ బిస్కెట్లు తాగిన బాలుడు మృతి చెందినట్లు సమాచారం. ఈ పానీయాలలో ద్రవ నైట్రోజన్ -196 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబడి ఉంటుంది. ఇది కడుపులోకి చేరగానే ఊపిరాడనివ్వదు. ద్రవ నైట్రోజన్ మనుషులను చంపేస్తుంది. ఈ రకమైన స్మోకీ డ్రింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also : Ponguleti Srinivas Reddy : కష్టాల్లో పొంగులేటి..నమ్మొచ్చా..?

Exit mobile version