Karimnagar: ఇది కదా అసలైన రక్షాబంధన్ అంటే.. తమ్ముడి కోసం 8 కి.మీ చెప్పులు లేకుండా నడిచిన వృద్ధురాలు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు రక్షాబంధన్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మిగతా రోజులు ఎంత కొట్ట

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 03:20 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు రక్షాబంధన్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మిగతా రోజులు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కూడా రక్షాబంధన్ రోజు ఇద్దరూ కలిసిపోవడం అన్నలకు తమ్ముళ్లకు అక్క చెల్లెలు ప్రేమతో రాఖీలు కట్టడంచేస్తూ ఉంటారు. రక్షాబంధన్ అన్నది వారి మధ్య ఉన్న బంధానికి ప్రతీక అని చెప్పవచ్చు. అన్న లేదా తమ్ముడు తనకు జీవితాంతం రక్షగా ఉంటాడు అని ఒక ఆడపిల్ల ఈ రాఖీలు కడుతూ ఉంటుంది.

ఈ రోజుల్లో చాలామంది విదేశాలకు, వేరే ఊర్లలో ఉండటంతో కనీసం తమ్ముళ్లకు అన్నలకు రాఖీ కట్టలేని పరిస్థితి. అలాంటిది ఒక 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టడం కోసం ఒంటరిగా ఏకంగా 8 కిలోమీటర్లు నడిచింది. శరీరంలో బలం చచ్చిపోయినా తమ్ముడిపై తనకున్న ప్రేమకు చావు లేదని నిరూపించింది. ఎర్రటి ఎండను పట్టించుకోకుండా కాలినడకన తమ్ముడికి రాఖీ కట్టేందుకు బయలుదేరింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ పొరుగున ఉన్న కొండయ్యపల్లికి వెళ్లింది.

ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 8 కిలోమీటర్లు నడిచి వస్తున్న వృద్ధురాలిని చూసిన ఒక యువకుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటూ పలకరించగా అప్పుడు వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టబోతున్నానని బదులిచ్చింది. తను కొత్తపల్లిలో ఉంటున్నానని, కొండయ్యపల్లిలోని తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు నడుచుకుంటూ వెళ్తున్నానని చెప్పింది. ఆ వీడియోను ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తమ్ముడంటే అంటే ఎంత ప్రేమో చెబుతూ తమ అక్కా, చెల్లెల్లను గుర్తు చేస్తున్నారు కొందరు కామెంట్స్ చేయగా ఇంకొందరు ఇది కదా అసలైన రక్షాబంధన్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.