Site icon HashtagU Telugu

Heart Attack : 8 ఏళ్ల బాలిక కు గుండెపోటు

8 Years Old Girl Heart Atta

8 Years Old Girl Heart Atta

ఈ మధ్య గుండెపోటులు ( Heart Attack ) మరణాలు అనేవి అనేకమయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తూ..ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ మరణాల సంఖ్య ఎక్కువైపోతోంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట గుండెపోటు మరణం అనే వార్త వెలుగులోకి వస్తుంది. పెద్దవారి కాదు చిన్న పిల్లలు కూడా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. తాజాగా 8 ఏళ్ల చిన్నారి గుండెపోటుకు (8 Years Old Girl Died) గురైన ఘటన గుజరాత్ అహ్మదాబాద్‌లోని జీబార్ స్కూల్లో చోటుచేసుకుంది. ప్రతి రోజుమాదిరిగానే 8 ఏళ్ల విద్యార్థిని స్కూల్‌కు వెళ్లింది. స్కూల్ బ్యాగు భుజాన వేసుకుని, యూనిఫాం ధరించి, చేతిలో ఒక బాస్కెట్ పట్టుకుని తరగతి గదికి వెళ్లేందుకు సిద్ధమైంది. తరగతి గదిలోకి వెళ్లేముందు, బాలికకు అకస్మాత్తుగా శారీరక నొప్పి ప్రారంభమైంది.

Pawan Kalyan : రూ.10 లక్షల పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా ?

మొదట నొప్పి ఏమిటో అర్థం కాక, కారిడార్‌లో నొప్పితో ఇబ్బంది పడుతూ తిరిగింది. అప్పటికే పక్కనే కొంతమంది టీచర్లు ఉన్నా, ఆ విషయాన్ని వారికి చెప్పలేకపోయింది. అసలు ఏమైందో వారు కూడా గమనించలేదు. బాలిక నొప్పితో అక్కడే కూర్చుంది. తోటి విద్యార్థి స్కూల్ సిబ్బంది చెప్పడంతో వెంటనే బాలికను గమనించి ఆమెతో మాట్లాడారు. ఈ లోపే ఆమె స్పృహతప్పి పడిపోయింది. వెంటనే సీపీఆర్ కూడా చేశారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే చిన్నారి చనిపోయిందని డాక్టర్స్ తెలిపారు. ఇంత చిన్న అమ్మాయికి గుండెపోటు ఏంటి దేవుడా అంటూ వారు తల్లిదండ్రులు ఏడ్చిన తీరు ఆస్పత్రిలో ఉన్న వారందరి చేత కన్నీరు పెట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధంచిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.