Site icon HashtagU Telugu

8 Year Weightlifter : ఏజ్ 8 .. ఎత్తిన బరువు 62 కిలోలు.. వహ్వా బాలిక !

8 Year Weightlifter

8 Year Weightlifter

8 Year Weightlifter :  ఆ చిన్నారి వయసు 8 ఏళ్లు.. 

కానీ ఆమె ఎత్తిన బరువు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు ! 

62 కిలోల బరువును ఎత్తి.. ఆ అమ్మాయి అందరితో వావ్ అనిపించింది..   

Also read : FIR On Priyanka Gandhi  : 41 జిల్లాల్లో ప్రియాంకాగాంధీ, కమల్‌నాథ్‌లపై ఎఫ్‌ఐఆర్.. “50 శాతం కమీషన్” లేఖపై రగడ

హర్యానాలోని పంచ్‌కుల జిల్లాకు చెందిన అర్షియా గోస్వామి 62 కిలోల బరువును ఎత్తి గిన్నిస్ రికార్డును సాధించింది. ఆమె 30 సెకన్ల వ్యవధిలో 17 సార్లు క్లీన్ అండ్ జర్క్ వెయిట్‌ లిఫ్టింగ్ చేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. అర్షియా తండ్రి అవినాష్ కుమార్ జిమ్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. తన జిమ్ కు కుమార్తె అర్షియాను తరుచూ తీసుకెళ్లేవాడు. ఈక్రమంలోనే  జిమ్ లో బరువులు ఎత్తడంపై  అర్షియాకు(8 Year Weightlifter)  ఆసక్తి మొదలైంది. దీన్ని గమనించిన ఆమె తండ్రి.. వెయిట్ లిఫ్టింగ్ లో కొద్దికొద్దిగా ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టర్ గుర్మెల్‌సింగ్ వద్దకు పంపి శిక్షణ ఇప్పించాడు. ఓ టీవీ చానల్ నిర్వహించే ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షో వేదికగా అర్షియా 62 కేజీల బరువు ఎత్తి గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అర్షియా ప్రతిభకు ముగ్ధుడైన హర్యానా అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్‌చంద్ గుప్తా  సన్మానించారు.

Also read : Cars Under 10 Lakhs: మీరు కారు కొనాలనుకుంటున్నారా.. అయితే రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..!