Site icon HashtagU Telugu

Chikkaballapur: మనవరాలి వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్న వృద్ధుడు.. ఎక్కడో తెలుసా?

Chikkaballapur

Chikkaballapur

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అలాగే సమాజంలో జరిగే కొన్ని రకాల సంఘటనల గురించి తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. మరి ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సంఘటనలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కాటికి కాలు చాచే వయసులో వృద్ధులు కూడా పెళ్లిళ్లు చేసుకొని సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక వృద్ధుడు నాకంటే దాదాపు 40 ఏళ్లు చిన్న అయిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.

తాజాగా కూడా ఒక 75 ఏళ్ల వృద్ధుడు మనవరాలు కూతురు వయసున్న 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నారు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో చిక్కబళ్లాపురం జిల్లా అప్పేగౌడన­హళ్లికి చెందిన ఈరన్న అనే మోతుబరి రైతు భార్య గతంలోనే మరణించింది. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో ఒంటరితనంతో బాధపడుతున్నాడు. మరోవైపు అనుశ్రీ అనే మ­హి­ళ కూడా భర్త నుంచి విడి­పోయి వేరుగా జీవిస్తోంది. ఆమెకు పిల్లలు ఉన్నా­రు.

ఈరన్న ఆమెతో పెళ్లి ప్రస్తావన తేవగా అందుకు ఆమె అంగీకరించింది. దీంతో స్వగ్రామంలో నిరాడంబ­రంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నా­రు. ఈ సందర్భంగా ఫొటోషూట్‌ జరుపుకున్నారు. మ­నవళ్లతో కాలక్షేపం చేస్తూ కృష్ణా రామా అనుకునే వయస్సులో తాతయ్య రెండో పెళ్లి చేసుకో­వడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ముసలోడికి దసరా పండగ అంటే ఇదే అని కొందరు కామెంట్ చేయగా, ఇంకొందరు కాటికి కాలు చాచే వయసులో పెళ్లి అవసరమా అంటూ మండిపడుతున్నారు. కొంతమంది ఆ వృద్ధుడికి అంటే తెలివి లేదు కనీసం ఆ మహిళకు అయినా తెలివి లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ దంపతుల పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version