రోజురోజుకీ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. నిత్యం దేశవ్యాప్తంగానే రోడ్డు ప్రమాదాల బారిన పడి పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు జరగడానికి గల ముఖ్య కారణాలు అతివేగం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం, త్రిబుల్ రైడింగ్ అంతకంటే ఎక్కువ మంది ప్రయాణించడం. అన్నిటికంటే ఎక్కువగా అతివేగం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దానివల్ల వారి ప్రాణాలు మాత్రమే కాకుండా పక్క వారి ప్రాణాలు కూడా పోతున్నాయి..
ముఖ్యంగా యువత ఒకే బండి పై నలుగురు ఐదుగురు ప్రమాదకర స్థాయిలో బండిపై కూర్చుని అతివేగంగా బండ్లు నడుపుతూ రోడ్లమీద ప్రమాదకర స్టంట్ లు చేస్తున్నారు. తాజాగా కూడా కొందరు యువకులు అలాంటి పని చేయడంతో పక్కనే వెళుతున్న వాహనదారులు వీడియోని తీసి ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓకే బైక్ ఇద్దరు ముగ్గురు కాదు ఏకంగా ఏడుగురు యువకులు ప్రమాదకరంగా ఆ ప్రయాణిస్తున్నారు.
Video of 7 people riding a bike in #Hapur goes viral, raising questions on the working style of Hapur police. #Viralvideo pic.twitter.com/wfMfjkOkdF
— Akshara (@Akshara117) August 9, 2023
అంతేకాకుండా స్పీడ్ తో అతివేగంతో ప్రయాణిస్తూ కేకలు వేస్తూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వారిలో ఏడవ వ్యక్తి అయితే ఏకంగా వ్యక్తి భుజాల పైన కూర్చున్నాడు.ఈ వీడియో యూపీలోని హాపూర్‌కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్‌పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్‌పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన, భయం కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సదరు యువకులపై నెటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడుతూ వెంటనే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటువంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆ బైక్ ని సీజ్ చేయాలని కొందరు పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ వీడియో పై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.