Viral : తండ్రి ఫై ఐదేళ్ల కొడుకు పోలీసులకు పిర్యాదు

‘మా నాన్న నన్ను ఆడుకోనివ్వట్లేదు, నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు, కొడుతున్నాడు’ అంటూ వచ్చీరాని మాటలతో గుక్క పెట్టి ఏడుస్తూ తన బాధను చెప్పుకున్నాడు.

Published By: HashtagU Telugu Desk
Year Old Walks Into A Polic

Year Old Walks Into A Polic

ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం..అలాగే తమ పిల్లలు సరిగా చూసుకోవడం లేదనో..లేక ఆస్తుల కోసం ఇబ్బంది చేస్తున్నారని ..ఇలా పిల్లలపై కూడా తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిర్యాదులు చేస్తుంటారు. తాజాగా ఓ ఐదేళ్ల బాలుడు తన తండ్రి ఫై పోలీసులకు పిర్యాదు చేసి వార్తల్లో నిలిచాడు.

We’re now on WhatsApp. Click to Join.

సాధారణంగా పిల్లలు ఎక్కువగా చేయోద్దన్న పని చేస్తుంటారు..దీంతో తల్లిదండ్రులకు కోపం వచ్చి అరవడం , చేయి చేసుకోవడం చేస్తుంటారు. ఇది కామన్. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ధార్‌కు చెందిన హుస్సేన్ అనే బాలుడు.. తన తండ్రిని జైలులో పెట్టాలని కానిస్టేబుల్ కు పిర్యాదు చేశాడు. ఎందుకని కానిస్టేబుల్ ప్రశ్నించగా.. ‘మా నాన్న నన్ను ఆడుకోనివ్వట్లేదు, నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు, కొడుతున్నాడు’ అంటూ వచ్చీరాని మాటలతో గుక్క పెట్టి ఏడుస్తూ తన బాధను చెప్పుకున్నాడు. తండ్రి ఇక్బాల్ ను వెంటనే జైలులో పెట్టాలని కానిస్టేబుల్ తో చెప్పాడు. అయితే, కంప్లైంట్ చేసేందుకు వెళ్లింది ఎవరితో తెలుసా.. వాళ్ల డాడీతోనే! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.

Read Also : AP High Court: ఏపీ హైకోర్టులో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తుల నియామకం: కేంద్రం నోటిఫికేషన్ జారీ

  Last Updated: 21 Aug 2024, 04:36 PM IST