Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్

మధ్యప్రదేశ్‌లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. నిజానికి ఈ దోపిడీ వీడియో హిందీ సినిమా ధూమ్ సన్నివేశాన్ని తలపిస్తోంది.

వీడియోలో ఒక వ్యక్తి ట్రక్కు వెనుక బైక్ నడుపుతుండగా, అతని సహచరులు వస్తువులను దొంగిలించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కి సరుకుపై ఉన్న టార్పాలిన్‌ షీట్‌ను కత్తిరించారు. ఆపై అందులో ఉన్న వస్తువుల్ని కిందపడేశారు. ఆ తర్వాత ట్రక్కు దిగి స్నేహితుడు నడుపుతున్న బైక్‌పైకి దూకారు. ట్రక్కు కదులుతున్న కొద్దీ రోడ్డుపై పడి ఉన్న వస్తువులను సేకరించేందుకు వీలుగా బైక్ వేగాన్ని తగ్గించి సినిమా తరహాలో దొంగతనానికి పాల్పడ్డారు.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఏ ట్రక్కు డ్రైవర్ కూడా ఇంతవరకు సంఘటనను నివేదించలేదు. వీడియో లభించిన వెంటనే దర్యాప్తు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Also Read: Nara Lokesh : వైసీపీ నేతలు లోకేశ్‌ను మిస్సవుతున్నారా..?