ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ రంగాల్లో (IT Employees, Corporate Sector Employees) పనిచేసే వారికి మళ్లీ వరుస సెలవులు (Holidays ) వచ్చేశాయి. ఈ వారం శుక్రవారం (Good Friday) పబ్లిక్ హాలిడేగా ఉండటంతో, శనివారం, ఆదివారం రెగ్యులర్ వీకెండ్ సెలవులు కలిపితే మొత్తం మూడు రోజులు బ్రేక్ లభిస్తోంది. ఇటీవలే ఉగాది, శ్రీరామ నవమి వంటి పండుగల నేపథ్యంలో చాలామందికి వరుస సెలవులు లభించాయి. ఇప్పుడు మరోసారి మూడు రోజుల హాలిడే వేకేషన్ రావడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
Gold Price : హమ్మయ్య.. 5 రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర
ఇప్పటికే కొన్ని కార్పొరేట్ స్కూళ్లు కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులకూ చిన్న వారాంతపు పండగే అని చెప్పొచ్చు. కొన్ని ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం లేదా కంపెన్సేటరీ లీవ్ ఆప్షన్‌తో తమ ఉద్యోగులకు మేలు చేస్తున్నారు. ఫలితంగా షార్ట్ ట్రిప్స్‌కు ప్లాన్ చేస్తున్నవారు, కుటుంబ సమేతంగా రిలాక్స్ అవుదామని చూస్తున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఈ నెలలో మరికొన్ని ప్రత్యేక దినాలు, స్థానిక సెలవులు ఉండే అవకాశం ఉండటంతో, మే నెలలో వేసవి సెలవులు మొదలయ్యేలోగా మళ్లీ ఇలాంటి లాంగ్ వీకెండ్ బ్రేకులు వస్తాయన్న ఆశాభావం ఉద్యోగుల్లో కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే పని ఒత్తిడిలో ఉన్నవారికి ఇది కొంత రిలీఫ్‌లా మారింది. చిన్నవాళ్లకు ఆటపాటలకు, పెద్దవాళ్లకు విశ్రాంతికి ఇదొక సరైన అవకాశం అని చెప్పొచ్చు.