Bust Auction : అదొక ప్రాచీన ఏకశిలా కళాకృతి. స్కాట్లాండ్‌కు చెందిన విఖ్యాత రాజకీయ నాయకుడు జాన్ గోర్డన్ అందమైన రూపంతో కూడిన శిల్ప అర్ధాకృతి అది. దాన్ని 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పి ఎడ్మె బౌఛార్డన్ అద్భుతంగా చెక్కారు. బౌఛార్డన్ చేతిలో రూపుదాల్చడం వల్ల ఈ శిల్పానికి ‘బౌఛార్డన్ అర్ధాకృతి’ అనే పేరు వచ్చింది. తమ దేశ రాజకీయ నాయకుడు దివంగత జాన్ గోర్డన్ గౌరవార్ధం ఈ శిల్పాన్ని 1930 సంవత్సరంలో స్కాట్లాండ్‌లోని ఇన్వెర్‌గోర్డన్ పట్టణ మండలి కొనుగోలు చేసింది. అప్పట్లో దాని కొనుగోలు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ? కేవలం 540 రూపాయలు. ‘బౌఛార్డన్ అర్ధాకృతి’ శిల్పం(Bust Auction) ప్రస్తుతం ఇన్వెర్‌గోర్డన్ పట్టణ మండలికి చెందిన కార్యాలయంలో కనువిందు చేస్తోంది.
Also Read :New Degree Syllabus : విద్యార్థులకు జాబ్ సాధించి పెట్టేలా డిగ్రీ కొత్త సిలబస్
కట్ చేస్తే.. దాదాపు 94 ఏళ్ల తర్వాత ఈ ‘బౌఛార్డన్ అర్ధాకృతి’ శిల్పం ధర కోట్ల రేంజుకు పెరిగిపోయింది. దాన్ని వేలం వేసేందుకు అనుమతించాలంటూ ఇన్వెర్‌గోర్డన్ పట్టణ మండలి వేసిన పిటిషన్‌ను స్కాట్లాండ్‌లోని ఓ కోర్టు ఇటీవలే విచారించింది. దీనిపై అన్ని పక్షాల వాదనలను సేకరించింది. అయితే ఎవరూ వేలంపాటకు అభ్యంతరం తెలపలేదు. దీంతో ‘బౌఛార్డన్ అర్ధాకృతి’ శిల్పాన్ని వేలం వేసుకునేందుకు అనుమతి మంజూరైంది. అనంతరం దీనిపై ఇన్వెర్‌గోర్డన్ పట్టణ ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించారు.ఈ ఏడాది జూన్ నాటికి ప్రజాభిప్రాయం కూడా శిల్పం వేలంపాటకు అనుకూలంగా వచ్చింది.
Also Read :Childrens Day 2024 : బాలల దినోత్సవాన్ని నవంబరు 14నే ఎందుకు నిర్వహిస్తారంటే..
అనంతరం దీన్ని ప్రపంచ ప్రఖ్యాత వేలంపాటల నిర్వాహక సంస్థ సోథ్‌బీస్ వద్ద వేలం కోసం లిస్టింగ్ చేశారు. వెంటనే ఈ శిల్పాన్ని కొనేందుకు పెద్దసంఖ్యలో బిడ్లు వచ్చాయి. అయితే స్కాట్లాండ్ పరిధిలోని వారికే ఈ వేలంలో పాల్గొనే అర్హత కల్పించాలనే వాదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ శిల్పం కోసం బిడ్ల స్వీకరణ ప్రక్రియ కొనుసాగుతోంది. కొంతమంది ఔత్సాహికులైతే ‘బౌఛార్డన్ అర్ధాకృతి’ శిల్పం కోసం ఏకంగా రూ.2.68 కోట్లకు బిడ్ దాఖలు చేశారని సోథ్‌బీస్ వెల్లడించింది. బిడ్లను స్క్రీన్ చేసే ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని అంటున్నారు.