Site icon HashtagU Telugu

Viral Video : కదులుతున్న రైలు కిందపడ్డ మహిళ.. ఇంతకీ ఏమైందంటే !!

Train Accident

Train Accident

అది రైల్వే ప్లాట్ ఫామ్..ప్రయాణికులంతా రైలు కోసం ఎదురుచూస్తున్నారు..వాళ్ళ మధ్యలో నిలబడిన ఒక మహిళ కాళ్లు వణకసాగాయి..ఆమె తనపై నియంత్రణ కోల్పోవడం మొదలుపెట్టింది. మైకం కమ్మేసి, ఏం జరుగుతుందో ఆమెకు అర్ధం కావడం లేదు..అంతలోనే.. అందరూ ఎదురుచూస్తున్న ట్రైన్ రానే వచ్చింది.. ట్రైన్ ఇంకా ఆగనే లేదు.. అంతలోనే ఆ మహిళ తనపై తాను అదుపుకోల్పోయింది. ఒక్కసారిగా మూర్ఛ చుట్టుముట్టడంతో, బొర్లుకుంటూ కదులుతున్న రైలు కింద పడింది. ఆ వెంటనే ట్రైను ఆగింది. దీంతో రెండు బోగీల మధ్య పడిన ఆమెను.. బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలకు ఎలాంటి అపాయం జరగలేదు. స్పృహ కోల్పోయి, స్వల్ప గాయాల పాలైన ఆమెను వెంటనే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.అర్జెంటీనా దేశ రాజధాని బ్యునస్ ఐర్స్ లోని రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

 

https://twitter.com/DiamondLouX/status/1516535733044973575

 

 

 

ఇది నాకు పునర్జన్మ

తృటిలో ప్రాణ గండం నుంచి బయటపడిన ఆ మహిళ ను స్థానిక మీడియా ఇంటర్వ్యూ చేసింది. “మూర్ఛ రావడంతో అప్పుడు ఏం జరిగిందో నాకు అర్ధం కాలేదు. రైల్వేస్టేషన్ లో నా పక్కన నిలబడ్డ వ్యక్తికి నా పరిస్థితి గురించి చెప్పాలని అనుకున్నా.. కానీ అంతలోనే నేను అదుపు కోల్పోయి ట్రైన్ కింద పడ్డాను.. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తుకు లేదు. మళ్లీ పునర్జన్మ లభించిన అనుభూతిలో ప్రస్తుతం నేనున్నాను” అంటూ ఆ మహిళ మీడియా కు చెప్పింది. కాగా, ఇప్పుడు ఆమె ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయింది.