Site icon HashtagU Telugu

Viral Video: సొర చేపకు ఊపిరి పోసిన రియల్ హీరోలు!!

Australia Shark

Australia Shark

సొర చేప (షార్క్) దాడి చేస్తే అంతే సంగతులు. దగ్గరి నుంచి దాన్ని చూస్తే గుండె గుబేల్ మనాల్సిందే!! అలాంటిది కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఒక సొర చేపను చూసి కొందరు యువకులు జాలిపడ్డారు. దాన్ని స్పృహలోకి తెచ్చి, తిరిగి సముద్రం లోకి వదిలారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం లో ఉన్న క్విన్ రాక్స్ సా బీచ్ లో జరిగింది.

జీవచ్చవంలా సముద్ర తీరంలో..

ఆ షార్క్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చి జీవచ్చవంలా పడింది. ఇక బతుకుతుందన్న ఆశల్లేవు. ఈ నేపథ్యంలో.. క్విన్ రాక్స్ సా బీచ్ కు వెళ్లిన ఆ ఏడుగురు యువకులు అంపశయ్య పై ఉన్న షార్క్ ను చూశారు. దీంతో వాళ్ళ మనసు ద్రవించింది. షార్క్ ను బతికించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. దాన్ని అటూ ఇటూ కదిలించి నోటిలోకి నీళ్లు పోయేలా చేశారు. దీంతో షార్క్ కు స్పృహ వచ్చింది. వెంటనే అది మెల్లగా వెనక్కి ఈదుతూ నీళ్ల లోకి జారుకుంది. ఆ యువతకు కృతజ్ఞత తెలిపినట్టుగా శరీరాన్ని అటూ.. ఇటూ..వేగంగా కదిలించింది. తమ ప్రయత్నం ఫలించి షార్క్ బతికినందుకు ఆ యువకులు సంతోషించారు. ఈ ఘట్టాన్ని వీడియో గా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. యువత మానవత్వం వల్లే.. షార్క్ ప్రాణాలు నిలిచాయని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

Exit mobile version