Site icon HashtagU Telugu

Renuka Chowdary Exclusive : నువ్వు త‌ప్పు చేశావ్ రేవంత్‌..- రేణుకా చౌద‌రి సంచ‌ల‌నం

Renuka

Renuka

వారం రోజుల క్రితం హైద‌రాబాద్‌లో జ‌రిగిన చింత‌న్‌శివిర్ సమావేశాల‌పై కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకా చౌద‌రి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేకుండా చింత‌న్ శిబిర్ స‌మావేశాలు ఎందుకు నిర్వ‌హించార‌నే ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక‌రికోసం కార్య‌క్ర‌మాలు వాయిదా వేయ‌ద‌ని, రేవంత్ ప‌నిమీద‌నే అమెరికా వెళ్లార‌ని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ రూపు మ‌రో సారి మార్చి చూపిస్తామ‌ని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిర్వ‌హిస్తున్న ర‌చ్చ‌బండ‌లో ప్ర‌జ‌లు ఏకరువు పెడుతున్నార‌న్న రేణుక .. కేసీఆర్‌ను ప్ర‌జ‌లు ఇక న‌మ్మే ప‌రిస్ధితి లేద‌ని అన్నారు. హ్యాష్‌టాగ్ యూతో రేణుక చౌద‌రి పూర్తి ఇంట‌ర్వ్యూ కింద వీడియోలో చూడండి

Exit mobile version