Site icon HashtagU Telugu

Zomato CEO Donates 700cr: జొమాటో వ్యవస్థాపకుడి దాతృత్వం..ఆ పిల్లల కోసం రూ.700కోట్ల విరాళం..!!

Zomato CEO

Zomato Ceo Deepinder Goyal

జొమాటో వ్యవస్థాపకుడి దాతృత్వం చాటుకున్నారు. కళ్లు చెదిరే విరాళాన్ని ప్రకటించారు దీపిందర్ గోయెల్. ఏకంగా 700కోట్ల రూపాయలను డొనేషన్ గా ఇవ్వనున్నట్లు తెలిపారు. జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్స్ కార్యకలాపాల కోసం అతను ఈ భారీ విరాళాన్ని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులందరికీ ఇ-మెయిల్స్ ద్వారా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పంపించారు. ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్ షిప్ ప్లాన్ కోసం ఈ నిధులను కేటాయించాల్సి ఉంటుంది.

జొమాటో డెలివరీ పార్ట్ నర్స్ ఇద్దరు పిల్లలకు చదువు చెప్పించడానికి లక్షరూపాయలను కంపెనీ కేటాయిస్తుది. ఐదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న వారు పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నవాళ్లు దీనికి అర్హులు. అదే పది సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నవారికి వారి ఇద్దరు పిల్లల చదువుకోసం రెండ లక్షల రూపాయలను కంపెనీ యాజమాన్యం అందిస్తుంది. ఐదు లేదా పదేళ్ల సర్వీసు ఉన్న మహిళా ఫుడ్ డెలివరీ పార్ట్ నర్స్ కోసం అదనపు సౌకర్యాన్ని కల్పించింది. 12వ తరగతి పూర్తి చేసుకునన ఆడపిల్లల కోసం ప్రైజ్ మనీని కూడా ప్రవేశపెట్టింది.

ఉద్యోగులు, సిబ్బంది పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా స్కాలర్ షిప్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదానికి గురైనవారి కుటుంబాలను ఆదుకోవడంతోపాటు వారి పిల్లల చదువుల కోసం కూడా ఈ 700కోట్ల రూపాయల నుంచి ఖర్చు చేయనున్నట్లు జొమాటో కంపెనీ తెలిపింది. ఈ విషయంలో సర్వీసుతో అవసరం లేదు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కూడా వర్తిస్తుంది.

ఇది తొలి అడుగు మాత్రమేనని…మరిన్ని వసతులు, సౌకర్యాలను తన సంస్థలో పనిచేస్తోన్న ఉద్యోగుల కోసం ప్రవేశపెడతామని దీపిందర్ గోయెల్ తెలిపారు. దీనికోసం జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్స్ కోసం పెద్దెత్తున విరాళాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు బాగుంటేనే సంస్థ బాగుంటుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

Exit mobile version