Site icon HashtagU Telugu

Zomato: నచ్చిన నగరంలో నచ్చిన ఆహారాన్ని ఇలా తెప్పించుకోవచ్చు.. జొమాటో సరికొత్త ఆప్షన్!

Zomato

Zomato

సాధారణంగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో ఆహార పదార్థానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. దీంతో కొంతమంది ఆ నగరాలలో లభించి ఆహార పదార్థాలను వేరే నగరంలోకి తీసుకెళ్లి అమ్మడం సరఫరా చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే మనకు కొన్ని నగరాలలో లభించే ఆ ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినాలి అనిపించినప్పుడు, అక్కడికి వెళ్లలేని పరిస్థితులలో ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా వాటిని తెప్పించుకుంటూ ఉంటాం. అయితే ఈ ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా మన చుట్టూ ఉన్న నగరంలో ఏవైతే దొరుకుతాయో అటువంటి ఆహార పదార్థాలు మాత్రమే మనకు లభిస్తాయి.

కానీ ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తాజాగా ఒకసారి కొత్త ఆలోచన ను చేసింది. అదేమిటంటే మ‌నం నివ‌సించే న‌గ‌రాలు కాకుండా వేరే ప్రాంతాల్లోని ఆహార పదార్థాలను జొమాటో సంస్థ డెలివ‌రీ చేయాల‌ని ప్లాన్ చేస్తోందట‌.. ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌ బిరియానీ, కోల్‌కతా రసగుల్లా, బెంగళూరు మైసూర్‌ పాక్‌, లఖ్‌నవూ కబాబ్‌, పాత దిల్లీ బటర్‌ చికెన్‌, జయపుర ప్యాజ్‌ కచోరీలను వేరే నగరాల్లోని వారు ఇంటి దగ్గరకు తెప్పించుకునే అవకాశాన్ని త్వరలోనే కల్పించబోతోంది జొమాటో సంస్థ. అయితే మొదట గురుగ్రామ్‌, దక్షిణ దిల్లీ లోని ఎంపిక చేసిన వినియోగదార్లకు ఈ అవకాశం కల్పించబోతున్నట్లు జొమాటో సీఈఓ దీపీందర్‌ గోయెల్‌ తాజాగా వెల్లడించారు.

ఆ తరువాత కొన్ని వారాల్లో ఈ అవకాశాన్ని అన్ని నగరాలకూ ఇంటర్‌సిటీ లెజెండ్స్‌ గా పేర్కొనే ఈ సేవలు విస్తరించాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆర్డర్‌ చేసిన మరుసటి రోజే ఆహార పదార్థాలను వినియోగదారుడికి చేరవేయాలనే లక్ష్యంతో పని చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ ఆహార పదార్థాల రంగు, రుచి, వాసన విషయంలో రాజీ పడకుండా, ల్యాబ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాతే వినియోగదారులకు అందిస్తాము అని ఆయన తెలిపారు. రెస్టారెంట్ లతో తాజా ఆహార పదార్థాలను తయారు చేయించి పునర్వినియోగించే, ట్యాంపర్‌ ప్రూఫ్‌ కంటెయినర్లలో ప్యాకింగ్‌ చేయించి, విమానాలలో సురక్షితంగా రవాణా అయ్యేలా చూస్తామన్నారు.