Perni Nani: పవన్ లెక్కలు చెబుతుంటే మంగళవారం సామెత గుర్తొస్తోందిః పేర్ని నాని

    Perni Nani: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు […]

Published By: HashtagU Telugu Desk
Perni Nani Motha Mogiddam

Perni Nani Motha Mogiddam

 

 

Perni Nani: టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్ సభ స్థానాలను పవన్ కల్యాణ్ అంగీకరించడం పట్ల వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు.

సీట్ల పంపకంపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే మంగళవారం సామెతను తలపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబు తన కులానికి 21 సీట్లు ప్రకటించుకున్నారని, కాపులకు మరీ హీనంగా 7 సీట్లు ప్రకటించారని విమర్శించారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు శ్రేయస్సు కోసమే రాజకీయాలు చేసే పవన్ కల్యాణ్ 24 సీట్లతో కాపులకు రాజ్యాధికారం అందిస్తాడా? పవన్ కల్యాణ్ ఎలాంటివాడో కాపులకు ఇవాళ అర్థమైంది… ఇన్నాళ్లూ మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు? అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఇక, పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే నిర్ణయిస్తారని అన్నారు.

కాగా, తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

read also : Free Bus : ఏపీలోనూ ‘ఉచిత బస్సు ప్రయాణం’.. ఎవరికి ?

  Last Updated: 24 Feb 2024, 07:21 PM IST