Site icon HashtagU Telugu

Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!

Ysrcp Mp Magunta Sreenivasulu Reddy To Join Tdp!

Ysrcp Mp Magunta Sreenivasulu Reddy To Join Tdp!

 

Magunta Sreenivasulu Reddy : ఏపీలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం అధికార వైఎస్‌ఆర్‌సిపి(ysrcp)లో వేడి పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ లకు సీటు లేదంటూ పార్టీ నాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. టికెట్ రాదనే క్లారిటీ వచ్చిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవచ్చే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో మాగుంటను జగన్(jagan) కనీసం పలకరించకపోవడం దీనికి నిదర్శనం.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో, మాగుంట శ్రీనివాసులురెడ్డి టిడిపి(tdp)లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో టిడిపి అధినేత చంద్రబాబు(chandrababu)తో మాగుంట భేటీ అవుతున్నట్టు సమాచారం. పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం ఢిల్లీ నుంచి మాగుంట నేరుగా హైదరాబాద్(hyderabad) చేరుకున్నారు. చంద్రబాబుతో చర్చల సందర్భంగా టిడిపి సీటుపై హామీ వచ్చిన తర్వాత… ఆ పార్టీలో చేరే విషయాన్ని మాగుంట ఒంగోలులో అధికారికంగా ప్రకటిస్తారు.

 

read also : Demands Of Farmers: ఢిల్లీలో రైతుల ఆందోళ‌న దేని కోసం.. MSP చ‌ట్టం అంటే ఏమిటి..?