Site icon HashtagU Telugu

YS Jagan : కూటమి పాలనలో బాదుడే బాదుడు: వైఎస్‌ జగన్‌

YS Jagan Comments On AP Govt

YS Jagan Comments On AP Govt

YS Jagan : ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి అలాంటి వారికే విలువ ఉంటుంది. మాట నిలబెట్టుకున్నామా లేదా అని చూస్తారు. హామీలు అమలు కాకపోతే ఆ నాయకుడి విలువ పోతుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారు.

గ్రామీణ రోడ్లలో టోల్‌గేట్లు కూడా పెడుతున్నారు. నేషనల్‌ హైవేలమీదలానే టోల్‌ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని జగన్ అన్నారు. కూటమి పాలనలో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఆరునెలల తిరక్కముందే కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరుగుతున్నాయి. స్థలాల్లోని పాతఇళ్ల మీదకూడా ఛార్జీలు వేస్తున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బులు చెల్లించడంలేదు. మనం ప్రతి మూడునెలలకూ విద్యాదీవెన కింద చెల్లించాం. విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. ఇంటివద్దకే డోర్‌ డెలివరీ పరిపాలనుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

మనం ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. నాయకులంతా యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం వచ్చేసింది. నేను కూడా జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నుంచి జిల్లాల పర్యనటకు వస్తాను. ప్రతి వారం మూడు రోజులు ఒక పార్లమెంటులో విడిచేస్తాను. ప్రతిరోజూ రెండు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను కలుసుకుంటాను. కేవలం మనం చంద్రబాబుతో యుద్ధంచేయడంలేదు.. మీడియాతోనూ యుద్ధంచేస్తున్నాం. వీరిని ఎదుర్కోవాలంటే.. సోషల్‌మీడియా ద్వారానే సాధ్యం అని జగన్ పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీకింద వేయి ప్రొసీజర్లను 3300 వరకూ పెంచి గొప్పగా అమలు చేశాం. 8 నెలల కాలంలోనే 3వేల కోట్లు ఆరోగ్యశ్రీకి బకాయిపెట్టారు. ఇంటివద్దకే డోర్‌ డెలివరీ పరిపాలనుంచి తిరిగి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే. పులినోట్లో తలకాయపెట్టడమే. ఇప్పుడు చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది.. పెడుతున్న పలావూ పోయింది. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడంలేదు. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు.. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు అని జగన్ పేర్కొన్నారు.

Read Also: Sam Konstas: విరాట్ కోహ్లీ నా ఆరాధ్య దైవం.. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కాన్స్టాస్‌

Exit mobile version