Site icon HashtagU Telugu

Harsha Sai : “బిగ్ బాస్-6″లోకి యూట్యూబ‌ర్‌ హర్షసాయి?

Harsha Sai

Harsha Sai

హర్ష సాయి బిగ్‌బాస్‌కు వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈవిషయం ఆ నోటా.. ఈ నోటా హర్ష సాయికి చేరింది. దీంతో బిగ్‌బాస్‌ ఎంట్రీపై అతడు స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. బిగ్‌బాస్‌కు తాను వచ్చే ఛాన్సే లేదని తేల్చి చెప్పాడు. తనకు స్వేచ్ఛగా ఉండటమే ఇష్టమని, అదే ముఖ్యమని నొక్కి చెప్పాడు. అందుకే యూట్యూబ్‌ వీడియోలు కూడా ప్రతివారం ఒకటి అప్‌లోడ్‌ చేయాలనే నియమం పెట్టుకోకుండా నచ్చినప్పుడు వీడియోలు చేస్తానని వివరించారు. యూట్యూబ్‌లో అందరూ డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే ఇతడు మాత్రం డబ్బులు పంచుతున్నాడు. ఎవరు కష్టాల్లో ఉన్నారో తెలుసుకుని వారికి తనవంతు సాయం చేస్తున్నాడు. ఈ సేవా కార్యక్రమాలతో సాయి రియల్‌ లైఫ్‌ శ్రీమంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో 10 లక్షల రూపాయలను దానం చేసేందుకు హర్షసాయి రెడీ అవుతున్నాడు . కాగా, ఇటీవల “బిగ్‌బాస్‌ 6” తెలుగు లోగో లాంచ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజవగా ఆ వీడియో కింద హర్షసాయి గురించే కామెంట్లు పెట్టారు. అన్న బిగ్‌బాస్‌లోకి వస్తున్నాడని కొందరు.. వచ్చి పేరు చెడగొట్టుకోవద్దని మరికొందరు కామెంట్లతో మోత మోగించారు.