YouTube Song Search : హమ్ చెయ్.. పాట వినెయ్.. యూట్యూబ్ అదిరిపోయే ఫీచర్ !

YouTube Music Live Lyrics : యూట్యూబ్ లో మరో సరికొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. అదే ‘యూట్యూబ్ మ్యూజిక్ లైవ్ లిరిక్స్’ !!

  • Written By:
  • Updated On - August 26, 2023 / 02:39 PM IST

YouTube Song Search : యూట్యూబ్  మరో రెండు సరికొత్త ఫీచర్ లను రిలీజ్ చేసింది. 

అవే ‘యూట్యూబ్ సాంగ్ సెర్చ్’.. ‘యూట్యూబ్ లైవ్ లిరిక్స్’ !!

Android స్మార్ట్ ఫోన్లు, ఐ ఫోన్లు రెండింటిలోనూ ఈ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే కొందరు యూజర్స్ కు మాత్రమే !! 

Also read : Rahul Sipligunj : పొలిటికల్ ఎంట్రీ ఫై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ..

యూట్యూబ్ మ్యూజిక్ లో ‘లైవ్ లిరిక్స్’ ఫీచర్  అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల యూట్యూబ్ మ్యూజిక్ లోని లిరిక్స్ ట్యాబ్‌ కొత్త డిజైన్ ను సంతరించుకుంది. మెరుగైన స్పేసింగ్‌, పెద్ద టెక్స్ట్‌తో  దాన్ని అప్ గ్రేడ్ చేశారు. ఇక ‘సాంగ్ సెర్చ్’  ఫీచర్ వల్ల  యూజర్లు వారికి నచ్చిన పాటను చాలాచాలా సులువుగా వెతుక్కోవచ్చు. యూట్యూబ్ వాయిస్ సెర్చ్ ఫీచర్‌తో ఈ సాంగ్ సెర్చ్ ను యాక్సెస్ చేయొచ్చు. 2020 సంవత్సరం నుంచే  గూగుల్ సెర్చ్‌లో ఉన్న ‘హమ్ టు సెర్చ్’ (Hum to Search)  ఫీచర్‌ను స్ఫూర్తిగా తీసుకొని.. ఈ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది.

Also read : Jagan Board : గోవిందా..హ‌ల లూయా.!TTD భాగోతం!!

మనకు నచ్చిన టాపిక్ లేదా పాట కోసం గూగుల్ హమ్ టు సెర్చ్‌లో 15 సెకన్ల పాటు హమ్ చేయాలి. కానీ యూట్యూబ్‌ మ్యూజిక్ లో జస్ట్ 3 సెకన్ల పాటు హమ్ చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే సెర్చ్ రిజల్ట్స్‌లో ఒరిజినల్ సాంగ్‌తో పాటు యూజర్ క్రియేట్ చేసిన కంటెంట్, షార్ట్స్ కంటెంట్‌లోని ఆ పాటకు సంబంధించిన వీడియోలన్నీ ప్రత్యక్షం అవుతాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను కొంతమంది యూట్యూబ్ మ్యూజిక్  యూజర్లకే (YouTube Song Search) రిలీజ్ చేశారు. క్రోమ్ కాస్ట్‌లో మ్యూజిక్ యాప్‌ను ఈజీగా యాక్సెస్ చేసేందుకు వీలుగా త్వరలో మరిన్ని కొత్త ఆప్షన్స్ ను కూడా యూట్యూబ్ మ్యూజిక్ లో  తీసుకురానున్నారు.