Site icon HashtagU Telugu

Train Video: పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!? రన్నింగ్ ట్రైన్ కింద పడుకుని రీల్, ఇదిగో వీడియో!

Train Video

Train Video

Train Video: సోషల్ మీడియాలో ‘ఫేమ్’ కోసం కొందరు యువకులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఇటీవలి కాలంలో రీల్స్ పేరుతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఒక యువకుడు రైలు వస్తుండగా ట్రాక్ పై పడుకుని సెల్ఫీ వీడియో (Train Video) తీయడం, రైలు వెళ్ళిపోయాక క్షేమంగా బయటపడటం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సజ్జనార్ స్పందన

ఈ వీడియోపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీ.సీ. సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ “పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!?” అని పేర్కొన్నారు.

Also Read: Sarfaraz Khan: ఈ స్టార్ క్రికెట‌ర్‌ని గుర్తు ప‌ట్టారా?.. 2 నెల‌ల్లోనే 17 కిలోలు త‌గ్గాడు!

సజ్జనార్ ఆందోళన, హెచ్చరిక

సజ్జనార్ సోషల్ మీడియాలో ఫేమ్ కోసం యువత చేస్తున్న ఈ ప్రమాదకర పనులు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రీల్స్ చేసి తక్షణమే ఫేమస్ కావాలనే తాపత్రయంతో, తాము ఎలాంటి వీడియోలు చేస్తున్నామనే ఆలోచన కూడా చేయట్లేదని ఆయన అన్నారు. ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎంతటి క్షోభను అనుభవిస్తారనే సోయి కూడా వీరికి ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి వారికి కౌన్సిలింగ్ అత్యవసరం అని ఆయన నొక్కి చెప్పారు. లేకుంటే, వీడియోలు వైరల్ అవుతున్నాయని, వీరు ఇంకా మరెన్నో వెర్రి పనులు చేసే ఆస్కారం ఉందని హెచ్చరించారు.