Shocking: ఇద్దరమ్మాయిలతో యువకుడు డేంజరస్ బైక్ రైడింగ్.. వీడియో చూస్తే షాక్!

అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ బైక్ రైడింగ్ చేయడం.

Published By: HashtagU Telugu Desk
Viral

Viral

సినిమాల ప్రభావమో.. పదిమందిలో ఒకరిగా పేరు తెచ్చుకోవాలనో.. కానీ నేటి యువత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, ప్రియురాలితో రొమాన్స్ చేస్తూ బైక్ రైడింగ్ చేయడం.. రాత్రివేళ ఇష్టానుసారంగా ప్రమాదకరంగా స్టంట్స్ చేయడం లాంటివన్నీ నిత్యం సోషల్ మీడియాలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిటీ అయిన ముంబైలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి.

అక్కడ రాత్రి వేళ యువకులు విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో యువకుడు తన బైక్ స్టంట్స్ తో అందర్నీ భయపెట్టాడు. సినిమాలో మాదిరిగా ముందు ఓ అమ్మాయి, వెనుక ఓ అమ్మాయిని కూర్చోపెట్టిన తన బైక్ ను గాల్లో లేపాడు. బిగ్గరగా అరుస్తూ ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. అమ్మాయిలు కూడా ఏమాత్రం భయపడకుండా బాయ్ ఫ్రెండ్ కు సపోర్ట్ చేయడం వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసిన యువకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇలాంటి ఘటనలు తమ ద్రుష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

Also Read: Janhvi Kapoor Pics: మండు వేసవిలో మంటలు రేపుతున్న జాన్వీ.. బికినీ ఫొటోలు వైరల్

  Last Updated: 01 Apr 2023, 04:41 PM IST