Site icon HashtagU Telugu

Drink Tea-Eat Cup : టీ+కప్.. టీ తాగొచ్చు.. కప్ తినొచ్చు!!

Drink Tea Eat Cup

Drink Tea Eat Cup

క్రియేటివిటీ.. ఎవరి సొత్తూ కాదు !!

బెంగాల్ లోని ఉత్తర దినాజ్‌పూర్‌లో ఉన్న కలియాగంజ్‌ కు చెందిన మామూ దాస్ చిన్న టీ షాప్ ను నడుపుతుంటాడు.. 

అతడికి ఒక క్రియేటివ్ ఐడియా(Drink Tea-Eat Cup) వచ్చింది.. 

టీ తాగిన తర్వాత బిస్కెట్ లాగా తినదగిన కప్స్ తయారు చేయిస్తే ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నకు సమాధానం కోసం మామూ దాస్ అన్వేషించాడు. దీంతో ఐస్ క్రీమ్ కోన్స్ తయారు చేసే ఒక యూనిట్ వాళ్ళను కలిశాడు.. తనకు ఐస్‌క్రీమ్ కోన్స్ లా తినదగిన టీ కప్స్(Drink Tea-Eat Cup) కావాలని చెప్పాడు.. వాటి తయారీకి ఆర్డర్ ఇచ్చాడు.. ఆ టీ కప్స్ తెచ్చి షాపులో పెట్టాక  టీ రేటును రూ.20కి పెంచాడు. అయినా గిరాకీ తగ్గకపోగా పెరిగింది.. ఇప్పుడు అతడి స్టాల్ దగ్గర టీ తాగడానికి పరిసర గ్రామాల ప్రజలు క్యూ కడుతున్నారు.

Also read : Business Ideas: ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే నెలకు రూ. 40,000 ఎక్కడకి పోవు..!

మామూ దాస్ టీ షాప్ కు వచ్చే వాళ్ళు ఎంచక్కా టీ తాగి, నోరూరించే కప్ తిని వెళ్తున్నారు. ఆ టీ కప్ టేస్ట్..  చాకోలెట్ ఫ్లేవర్ కలిగిన బిస్కట్ లా ఉందని మామూ దాస్ హోటల్ కు వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు.. ప్లాస్టిక్, కాగితం, మట్టి టీ కప్స్ ను తలదన్నేలా మామూ దాస్ ఫ్యాన్సీ  టీ కప్స్ ఉన్నాయని వారు ప్రశంసిస్తున్నారు.