Yoga Day : జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా మన దేశం ప్రపంచానికి అందించిన అపూర్వమైన బహుమతిగా అభివర్ణించిన ఆయన, ప్రతి ఒక్కరూ ఈ రోజును ఉత్సాహంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా “ఎక్స్” లో పోస్ట్ చేస్తూ చిరంజీవి స్పందించారు. ఫోకస్ వల్ల ఫిట్‌నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. యెగా డేను సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. ఇది సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందరూ కలిసి #IDY2025 ని ఘనంగా జరుపుదాం అని ఆయన పేర్కొన్నారు. యోగా వల్ల శరీరానికి ఆరోగ్యం, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Harish Rao: హైకోర్టులో హరీశ్‌రావుకు ఊరట
ఈ సందర్భంగా యోగాను మరింత ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా మాసోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. జిల్లాల వారీగా ప్రత్యేక శిబిరాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ద్వారా యోగాపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కృషిని అభినందించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లో యోగా కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు యోగాను స్వీకరించి, దాన్ని జీవితంలో భాగంగా మార్చుకోవడం చూసి ఎంతో సంతోషంగా ఉంది. వారి కృషి ప్రశంసనీయమైనది అని మోడీ అన్నారు. యోగా అనేది భారతదేశ పునాది నుంచి వచ్చిన జీవనశైలి అని, ఇది భౌతిక, మానసిక శాంతికి మార్గం అని ఆయన గుర్తు చేశారు.
జూన్ 21న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా ఉత్సాహం కనిపిస్తోంది. గ్రామీణ స్థాయిలోనూ నగరాల్లోనూ పెద్ద ఎత్తున యోగా సెషన్లు, ర్యాలీలు, వర్క్‌షాప్‌లు నిర్వహించడానికి సిద్ధత చూపిస్తున్నారు. ప్రముఖులు, సాధారణ ప్రజలతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడానికి ముందుకొస్తున్నారు. చిరంజీవి ఇచ్చిన పిలుపు యువతలో ఉత్తేజాన్ని నింపుతోంది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తుచేసే యోగా ద్వారా మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందాం అని ఆయన సందేశం ప్రజల హృదయాలను తాకుతోంది.