Sitaram Yechury : ఏచూరికి పాత పాటలంటే ఎంతో ఇష్టం..

Sitaram Yechury : సీతారాం ఏచూరికి 1960-70ల నాటి హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చూసేవారు. న్యూస్ ఛానళ్లు మాత్రం అస్సలు చూడనని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Yechuri Likes Old Songs

Yechuri Likes Old Songs

Sitaram Yechury : సీపీఎం (CPM) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారం ఏచూరి (Sitaram Yechury) (72) క‌న్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయ‌న శ్వాస‌కోస స‌మ‌స్య‌తో బాధపడుతూ.. ఈరోజు ఢిల్లీ ఎయిమ్స్‌ (Delhi AIIMS Hospital)లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సీతారాం మరణ వార్త తెలిసి ప్రతి ఒక్కరు స్పందిస్తూ ఆయన గురించి మాట్లాడుకోవడం..ఆయనకు ఎక్కువగా ఇష్టమైనవి..ఇష్టం లేనివి..తదితర వ్యక్తి గత విషయాలు తెలుసుకోవడం , మాట్లాడుకోవడం చేస్తున్నారు.

సీతారాం ఏచూరి (Sitaram Yechury)కి 1960-70ల నాటి హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చూసేవారు. న్యూస్ ఛానళ్లు మాత్రం అస్సలు చూడనని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. అలాగే దేవుడంటే నమ్మకం లేదని, ఆధ్యాత్మిక ఉన్నతికి, మతానికి సంబంధం లేదన్నారు. నాస్తిక ఆధ్యాత్మికతను విశ్వసిస్తా అనేవారు. పొలిటీషియన్ కాకుంటే బహుశా ఎకనామిక్ ఫ్రొఫెసర్, పొలిటికల్ విద్యా వేత్త అయ్యేవాడినన్నారు. తనపని గురించి ఆలోచిస్తూ రాత్రుళ్లు నిద్రపోయేవారు కాదన్నారు.

సీతారాం ఏచూరి (Sitaram Yechury) బాల్యమంతా హైదరాబాద్లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్లోనే ఆయన టెన్త్ వరకు చదివారు. 1969లో తెలంగాణలో ఉద్యమం ఉద్ధృతం అవ్వడంతో ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆయన తల్లిదండ్రులు కాకినాడ వాస్తవ్యులు. అందుకే ఆయనకు హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఎక్కువే. ఈ కారణంతోనే ఎందరో తెలుగువారిని మార్క్సిస్టు పార్టీకి చేరువ చేశారు. జాతీయ నేతలుగా తీర్చిదిద్దారు. తెలంగాణ ఉద్యమంపై ఆయనకెంతో అవగాహన ఉంది.

సీతారాం ఏచూరి (Sitaram Yechury) సుదీర్ఘకాలం రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. తొలిసారి ఆయన 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఏచూరి చట్టసభలో సామాన్యుల పక్షాన గొంతెత్తారు. ప్రభుత్వాలపై తనదైన శైలిలో ప్రశ్నలు సంధించేవారు. ప్రస్తుత కమ్యూనిస్ట్ అగ్రనేతల్లో ఒకరైన ఏచూరికి దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు.

Read Also : Raw Coconut: ఏంటి పరగడుపున పచ్చికొబ్బరి తినడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలా?

  Last Updated: 12 Sep 2024, 05:57 PM IST