EC : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 02:44 PM IST

వైసీపీ(YCP) తరపున మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఎన్నికల సంఘానికి(Electoral Commission) ఫిర్యాదు(complaint) చేశారు. ఈ మేరకు ఆయన ఈసీ అధికారులని కలిసి పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు(Postal Ballot Counting) సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశామని..అన్ని రాష్ట్రాలకు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపామని పేర్ని నాని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని గతంలో చెప్పారు. స్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారు. కానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారు.

Read Also: YS Jagan : 2 నెలల్లో 21000 కోట్ల రుణం… జగన్ ఘనతే..!

దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదు….ఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందన్నారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారని అడిగామని వివరించారు మాజీ మంత్రి పేర్ని నాని.