Site icon HashtagU Telugu

Self Driving Bus : సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులు వస్తున్నాయహో.. ఎప్పుడంటే ?

Self Driving Bus

Self Driving Bus

Self Driving Bus : మీరు బస్సులో జర్నీ చేస్తుంటారా ?

సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులో మీరు జర్నీ చేసే రోజులు ఇంకా ఎంతో దూరంలో లేవు..

ఎందుకంటే.. సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు డెవలప్మెంట్ దిశగా మన ఇండియాలో ప్రయత్నాలు మొదలయ్యాయి. 

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (LPU)లోని ఇంజనీరింగ్ విద్యార్థులు సౌరశక్తితో నడిచే డ్రైవర్‌లెస్ బస్సును ఇటీవల డెవలప్ చేశారు. వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ఆధారంగా ఇది డ్రైవర్ లేకుండానే నడవగలదు. ఇందులో నావిగేషన్ కోసం GPS, బ్లూటూత్‌ సౌకర్యాలు ఉన్నాయి. ఈ బస్సు గంటకు 30 కిమీ వేగంతో నడుస్తుంది.  ఈ డ్రైవర్‌లెస్ బస్సులో 30 మంది దాకా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఈ బస్సు పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. ఇందులో ప్రొపల్షన్ కోసం విద్యుత్ మోటారు, సోలార్ పవర్ మాత్రమే వినియోగిస్తారు.  ఈ వివరాలను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ వింగ్ హెడ్ డాక్టర్ సోరభ్ లఖన్‌పాల్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ టెక్నికల్ హెడ్ మన్‌దీప్ సింగ్ వెల్లడించారు.  

ప్రపంచంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు షురూ

మరోవైపు స్కాట్లాండ్‌ రాజధాని ఎడిన్‌బర్గ్‌లో ప్రపంచంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ బస్సు(Self Driving Bus) ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. 14 మైళ్ల రోడ్డు మార్గంలో ఇది డ్రైవర్ సాయం లేకుండా సేఫ్ గా ప్రయాణికులతో జర్నీ చేసింది. ఈ బస్సు 90 శాతం సొంతంగా డ్రైవింగ్ చేస్తుంది. 10 శాతం డ్రైవర్ సీటుపై ఉన్న వ్యక్తి కంట్రోల్ చేస్తాడు. స్టేజ్‌ కోచ్‌ సంస్థ వీటిని లాంచ్‌ చేసింది. మొత్తం 5 సెల్ఫ్ డ్రైవింగ్ బస్సులు నడుస్తాయని..  వారానికి 10వేలమంది ప్రయాణికులు వీటి సేవల్ని పొందుతారని అధికారులు తెలిపారు. గంటకు 50 మీటర్ల వేగంతో ఈ బస్సులు ప్రయాణిస్తాయి. వచ్చే ఏడాది వీటి సంఖ్యను మరింత పెంచనున్నారు. ఈ బస్సుల తయారీ ప్రాజెక్టుకు కొంతమేర నిధులను యూకే ప్రభుత్వం సమకూర్చింది.

Exit mobile version