Biggest Fish: ప్రపంచంలోనే అత్యంత భారీ చేప.. దీని ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మనము ఉన్న ఈ భూ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి. అందులో సముద్రంలో కూడా కొన్ని వందల రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి.

  • Written By:
  • Updated On - June 21, 2022 / 08:45 PM IST

మనము ఉన్న ఈ భూ ప్రపంచంలో ఎన్నో జీవరాశులు జీవిస్తున్నాయి. అందులో సముద్రంలో కూడా కొన్ని వందల రకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. అయితే ఈ సముద్రంలో నివసించే చేపలు, తిమింగలాలు లాంటి జీవులు అప్పుడప్పుడు జాలర్లకు లేదా సముద్ర తీరాలకు కొట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకూ మనం చాలా రకాల చేపలను చూసి ఉంటాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే చేప మాత్రం ప్రపంచంలోకెల్లా అతి పెద్ద చేప. అయితే ఇది మేము చెబుతున్న మాట కాదు.. పరిశోధకులు శోధించి ఆ తర్వాత తెలిపారు.

అయితే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన పెద్ద చేపల తో పోల్చుకొని దీన్ని నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కంబోడియా మోకాంగ్ నదిలో ఈ అతి పెద్ద భారీ చేపను గుర్తించారు. పదుల సంఖ్యలో జాలర్లు ఆ చేపను ఒడ్డుకు లాక్కొని వచ్చారు. ఖేమర్ భాషలో క్రిస్టెన్డ్ బోరామి అనగా పూర్తి చంద్రుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ చేపకు దాని ఆకారం వల్లే ఆ పేరు వచ్చింది. అయితే దొరికిన ఆ భారీ చేప ను పరిశీలించిన పరిశోధకులు జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్ ట్యాగ్ తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు.

దీని ద్వారా ఇకనుంచి దాని కదలికలను పరిశీలించనున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో మాంస్టర్ ఫిష్ నిర్వాహకుడు అయిన జెబ్ హోగన్ దానిని ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి చేపగా అధికారికంగా గుర్తించారు. ఆ చేప సుమారుగా 13 అడుగుల పొడవు దాదాపు 300 కేజీల బరువు ఉంది. ఇంతకుముందు 2005లో థాయిలాండ్ లో 293 కేజీల బరువున్న ఒక గక్యాష్ ఫిష్ ను పరిశోధకులు గుర్తించారు. ప్రపంచంలోనే చేపలు ఆవాసం ఎక్కువగా ఉండే నదిలో మోకాంగ్ నది కూడా ఒకటి. మితిమీరి చేపలు పట్టడం, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు ఇలా పలు కారణాల వల్ల చేపలు సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది.