Shocking: ఇదేమీ ఆచారం.. ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించడం నిషేధం, ఎందుకో తెలుసా!

విచిత్రమైన ఆచారాలను అనుసరించే గ్రామాలు మన దేశంలో చాలానే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 03:50 PM IST

ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొన్ని వింత ఆచారాలు పాటిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో కూడా విచిత్రమైన ఆచారాలను అనుసరించే గ్రామాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు మరో వింత ఆచారం గురించి తెలుసుకుందాం. దుస్తులు ధరించడం నాగరికత కాలం నాటిది. ఈ రోజుల్లో బట్టలు లేకుండా కనిపించడం లేదు. కానీ ఓ  గ్రామంలో మహిళలు అసలు బట్టలు వేసుకోకుండా తిరుగుతుంటారు. వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది. ఆ ఊరిలో ఆడవాళ్ళు బట్టలు విప్పేస్తారట

ఈ ఊరు ఎక్కడో కాదు ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్‌లోని మణికర్ణ లోయలో ఉంది. ఆ ఊరి పేరు పిని. ఈ ఊరు శతాబ్దాల క్రితం పుట్టింది. కానీ ఇక్కడ మహిళలు దుస్తులు ధరించడం నిషేధించబడింది. మహిళలు ఇప్పటికీ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. బట్టలు లేకుండా జీవిస్తున్నారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. స్త్రీలు ఏడాది పొడవునా బట్టలు లేకుండా ఉండవచ్చని అనుకోకండి. ఏడాదికి ఐదు రోజులు మాత్రమే బట్టలు లేకుండా జీవిస్తారు. ఇది ఆ ఊరి ఆచారం. ఆ ఐదు రోజులు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలు బట్టలు లేకుండా ఉండాలి.

అందుకే ఆ ఐదు రోజులు మహిళలు బయటకు రారు. ఇంట్లో బట్టలు లేకుండా ఉంటున్నారు. ఐదు రోజుల తర్వాత బట్టలు వేసుకుని ఊరంతా తిరుగుతారు. ఇక్కడ స్త్రీలకే కాదు కాదండోయ్ పురుషులకు కూడా ప్రత్యేక ఆచారాలు ఉన్నాయి. సంవత్సరంలో ఐదు రోజులు మద్యం సేవించవద్దు. మాంసం తినకూడదు. భార్యాభర్తలు మాట్లాడుకోరు. ఈ పట్టణంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. అందుకే ఈ పట్టణాన్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఆచారం వెనుక పెద్ద కథే ఉందని గ్రామస్తులు అంటున్నారు.

గతంలో పిని గ్రామాన్ని దయ్యాలు వచ్చి ఆక్రమించాయి. గ్రామంలోని పెళ్లయిన మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే దెయ్యాలు తీసుకెళ్తాయి. అప్పుడు గ్రామదేవత రాక్షసులను తరిమివేసి స్త్రీలను రక్షించింది. అప్పటి నుంచి ఆ ఊరిలో మహిళలు బట్టలు వేసుకోకూడదనే ఆచారాన్ని పాటిస్తున్నారు. అందమైన బట్టలు వేసుకుంటే దెయ్యాలు వచ్చి తీసుకెళ్తాయేమోనన్న భయం ఇప్పటికీ ఆ ఊరి ప్రజల్లో ఉంది. అందుకే ఏడాదిలో ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరించకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించారు. పట్టణం చుట్టూ అందమైన పచ్చని కొండలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పట్టణం కూడా పర్యాటక ప్రాంతాల జాబితాలో చేరింది.

Also Read: Tribal Woman: రోడ్డుపై గిరిజన మహిళ ప్రసవం.. నిర్మల్ జిల్లాలో ఘటన!